Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

వద్దంటే, భార్యలకు విడాకులివ్వాలా: ఆటగాళ్లకు అండ

Posted by:
Published: Thursday, August 13, 2015, 12:41 [IST]

లండన్: యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఘోర పరాజయానికి వారి వెంట భార్యలు, ప్రియురాళ్లు ఉండటమేనని, ఇద్దరు క్రికెటర్ల భార్యల మధ్య గొడవలు ఉన్నాయనే విమర్శలు, ఆరోపణలు వచ్చాయి. దీనిపై మాజీ ఆటగాడు రాడ్ మార్ష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

సిరీస్‌ సందర్భంగా క్లార్క్‌ సహా కొందరు ఆటగాళ్లకు వారి భార్యలతో పడట్లేదని, ఆ గొడవలు ఆట మీద ప్రభావం చూపాయని నిందించడంపై రాడ్ మార్ష్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు సంతోషంగా ఉండటం ఇష్టం లేదా? వాళ్లు భార్యల నుంచి విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా? అని ప్రశ్నించాడు.

ప్రస్తుత బిజీ షెడ్యూల్లో కుటుంబాన్ని చూడకుండా క్రికెట్‌ ఆడటం కష్టమని, కుటుంబ సభ్యులు తోడుంటేనే సంతోషంగా ఉంటామని ఏ ఆటగాడైనా చెబుతాడని, భార్యలు కొట్లాడతారని తాను అయితే అనుకోవడం లేదని చెప్పాడు.

Ashes 2015: Rod Marsh says banning WAGS from tours could cause divorces

కాగా, తాజా యాషెస్ సిరీస్‌లో మరో టెస్టు మిగిలి ఉండగానే జయభేరి మోగించడం ద్వారా ఇంగ్లాండ్ కెప్టెన్ ఆలిస్టర్ కుక్ పతాక శీర్షికలకెక్కాడు. కానీ, కౌంటీల్లో సొంత జట్టయిన ఎసెక్స్ మాత్రం కుక్ సామర్థ్యంపై సందేహం వ్యక్తం చేస్తోంది.

కుక్ పరిమిత ఓవర్ల క్రికెట్‌కు పనికి రాడని తేల్చిన ఆ జట్టు వ్యూహకర్తలు దేశవాళీ టి20 టోర్నీలో అతను అవసరం లేదని నిర్ణయించుకున్నారు. ఎసెక్స్ జట్టు గురువారం వార్విక్ షైర్‌తో టి20 టోర్నీ క్వార్టర్ ఫైనల్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కుక్‌తో జట్టు కోచ్ పాల్ గ్రేసన్, కెప్టెన్ ర్యాన్ టెన్ డష్కాటే మాట్లాడారు.

టోర్నీ ఆరంభం నుంచి ఆడుతున్న జట్టుతోనే బరిలో దిగుతున్నామని కుక్‌కు చెప్పారు. కుక్ కూడా తమ నిర్ణయం పట్ల సానుకూలంగా స్పందించాడని గ్రేసన్ తెలిపారు. కొన్నాళ్లుగా కుక్‌ను ఇంగ్లాండ్ బోర్డు కూడా పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి దూరం పెట్టింది. అతని సేవలు టెస్టు క్రికెట్లోనే ఉపయోగించుకోవాలనుకుంటోంది.

English summary
Rod Marsh says banning WAGS from tours could cause divorces.
మీ వ్యాఖ్య రాయండి