Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

తొలి టెస్ట్, డే2: శిఖర్, కోహ్లీ సెంచరీలు, 375 ఆలౌట్

Updated: Thursday, August 13, 2015, 18:34 [IST]

గాలె: 192 పరుగుల ఫాలౌ‌న్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక.. వెంట వెంటనే ఓపెనర్లను కోల్పోయింది. ఓపెనర్లుగా వచ్చిన కరుణరత్నె, జెకె సిల్వ పరుగులేమి చేయకుండానే వెనుదిరిగారు. అశ్విన్ కరుణరత్నె వికెట్ తీయగా, మిశ్రా సిల్వ వికెట్ తీశాడు. ప్రస్తుతం ప్రసాద్ 3, సంగక్కర 1 పరుగులతో క్రీజులో ఉన్నారు.

అంతకుముందు, గాలె అంతర్జాతీయ మైదానంలో భారత్‌-శ్రీలంక మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 375 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో భారత్ 192 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులు చేసింది. కాగా, 128/2 ఓవర్‌ నైట్‌ స్కోరుతో భారత్‌ రెండో రోజు ఆట ప్రారంభించింది. ఓపెనర్‌గా వచ్చిన కెఎల్ రాహుల్ 7 పరుగులకే ప్రసాద్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

ఆ తర్వాత కేవలం 9 పరుగులు చేసిన రోహిత్ శర్మ మాథ్యూస్ బౌలింగ్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. కాగా, శిఖర్‌ ధావన్‌, విరాట్‌ కోహ్లి అజేయ భాగస్వామ్యంతో 69.2 ఓవర్లకు 235 పరుగులు పూర్తి చేశారు.

 India vs Sri Lanka 1st Test Day 2: Dhawan, Kohli Close in on SL Total

అనంతరం 134 పరుగుల వద్ద ప్రదీప్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్ ఔటవగా, కుశల్ బౌలింగ్‌లో 103 పరుగులు చేసిన కోహ్లీ వెనుదిరిగాడు. కుశల్ బౌలింగ్‌లోనే రహేనే డకౌట్ ఔటయ్యాడు. 7 పరుగులు చేసిన అశ్విన్ ప్రదీప్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. హర్భజన్ సింగ్ 14, అమిత్ మిశ్రా 10 పరుగులు చేసి కుశల్ బౌలింగ్‌లో ఔటయ్యారు.

ఆ తర్వాత 60 పరుగులు చేసిన సాహా ప్రదీప్ బౌలింగ్‌లో ఔటవగా, వరుణ్ ఆరోన్ 4 పరుగులు చేసి కుశల్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇశాంత్ షర్మ 3 పరుగులతో అజేయంగా నిలిచాడు.

మొదటిరోజు ఆట వివరాల కోసం..

అదరగొట్టిన అశ్విన్, లంక 183కే ఆలౌట్: భారత్ 128/2

Story first published:  Thursday, August 13, 2015, 11:23 [IST]
English summary
Herath has applied the pressure from one end, keeping things tight with runs not coming easily. It hasn't been the same from the other end, though, with Pradeep and Kaushal not able to stem the runs. The deficit is into single figures. India 174/2 in 51 overs, trail by 9 runs. Dhawan 83, Kohli 60.
మీ వ్యాఖ్య రాయండి