Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

లెప్ట్ హ్యాండర్స్ డే రోజున ధావన్ సెంచరీ ప్రత్యేకం

Posted by:
Published: Thursday, August 13, 2015, 12:13 [IST]

గాలే: అంతర్జాతీయ లెప్ట్ హ్యాండర్స్ డే అయిన ఈరోజు (ఆగస్టు 13)న టీమిండియా లెప్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ శిఖర్ ధావన్ శ్రీలంకలోని గాలేలో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీ సాధించాడు. 53 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు బరిలోకి దిగిన శిఖర్ ధావన్ 178 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో సెంచరీ సాధించాడు.

56.6 ఓవర్ వద్ద ప్రసాద్ బౌలింగ్‌లో ధావన్ ఫోర్‌తో సెంచరీ పూర్తి చేశాడు. శిఖర్ ధావన్‌కు టెస్టుల్లో ఇది 4వ సెంచరీ. తొలి ఇన్నింగ్స్‌లో భారత్, శ్రీలంకపై ఆధిక్యం దిశగా కొనసాగుతోంది. ప్రతి ఏడాది ఆగస్టు 13ని అంతర్జాతీయ లెప్ట్ హ్యాండర్స్ డేగా జరుపుకుంటారు.

63 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 2 వికెట్లను నష్టపోయి 227 పరుగులు చేసింది. శ్రీలంకపై 44 పరుగులు ఆధిక్యతతో భారత్ కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో శిఖర్ ధావన్ 110, విరాట్ కోహ్లీ 86 పరుగులతో ఉన్నారు.

Southpaw Shikhar Dhawan hits Test ton on International Left-Handers Day

29ఏళ్ల శిఖర్ ధావన్ లెప్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ కావడం, ఈరోజే అతను సెంచరీ సాధించడం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. తొలి రోజే టీమిండియా స్ఫిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 46 పరుగులిచ్చి 6 వికెట్లు తీసి, శ్రీలంక టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు.

దీంతో 183 పరుగులకే శ్రీలంక కుప్పకూలింది. తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ 2 వికెట్లను కోల్పోయి 128 పరుగులు చేసింది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా తొలి టెస్టు గాలేలో ఆగస్టు 12న ప్రారంభమైంది. రెండో టెస్టు కొలంబోలో ఆగస్టు 20న ప్రారంభం కానుంది.

English summary
India's left-handed opening batsman Shikhar Dhawan scored a century on International Left-Handers Day today (August 13) against Sri Lanka.
మీ వ్యాఖ్య రాయండి