Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

క్యాచ్‌లు మిస్ చేశారు: ధావన్, లంకలో ఇవీ రికార్డ్‌లు..

Posted by:
Published: Friday, August 14, 2015, 12:31 [IST]

గాలే: శ్రీలంక ఆటగాళ్లు తన క్యాచ్‌లు మిస్ చేశారని శిఖర్ ధావన్ నవ్వుతూ చెప్పాడు. గురువారం నాటి మ్యాచ్ ముగిశాక అతను విలేకరులతో మాట్లాడాడు. వరుణ్ ఆరోన్ బౌలింగులో కౌషల్ సిల్వా ఇచ్చిన క్యాచ్‌ను పట్టబోయే సమయంలో తనకు దెబ్బ తగిలిందని చెప్పాడు.

ఈ సంఘటన తొలి ఇన్నింగ్సులో జరిగిందని చెప్పాడు. దీని ప్రభావం కొద్దిగా పడిందని, తాను ఎక్కువ షాట్లు ఆడలేదని చెప్పాడు. తాను ఇలా ఆడటాన్ని ఆస్వాదిస్తానని చెప్పాడు. ఓ బ్యాట్స్‌మన్‌గా తాను క్రీజులో ఎక్కువ సమయం ఉండేందుకు చూస్తానని చెప్పాడు.

ఎవరైన తన క్యాచ్ వదిలేసినప్పుడు తాను అలర్ట్ అయి మళ్లీ ఫ్రెష్‌గా ఆడుతున్నట్లు భావిస్తానని చెప్పాడు. తమ బ్యాటింగ్ కోచ్ అద్భుతం అన్నాడు. తమకు మంచి సూచనలు ఇస్తున్నాడని చెప్పాడు. తన ఆట సంతృప్తినిచ్చిందన్నాడు.

కాగా, శ్రీలంకతో గురువారం జరిగిన ఇన్నింగ్స్‌లో శిఖర్ ధావన్ 134 పరుగులు చేసిన విషయం తెలిసిందే. భారత ఓపెనర్ విదేశాల్లో వరుసగా మూడు టెస్టుల్లో సెంచరీ సాధఇంచడం ఇది మూడోసారి. సునీల్ గవాస్కర్, రాహుల్ ద్రావిడ్ తర్వాత.. ఇప్పుడు ధావన్ ఆ జాబితాలో చేరాడు.

Centurion Shikhar Dhawan reveals he batted in pain

ధావన్ - కోహ్లీ మూడో వికెట్‌కు నెలకొల్పిన 227 పరుగుల భాగస్వామ్యాం శ్రీలంకలో భారత్‌కు అత్యుత్తమం. 1993లో కాంబ్లీ - సచిన్ నెలకొల్పిన 162 పరుగుల భాగస్వామ్యం ఇప్పటి వరకు బెస్ట్. కోహ్లీ కెప్టెన్‌గా నాలుగు టెస్టుల్లో నాలుగు సెంచరీలు చేశాడు. గతంలో సునీల్ గవాస్కర్, అలిస్టర్ కుక్ ఈ ఘనత సాధించారు.

టాప్ 5లోని నలుగురు భారత బ్యాట్సుమెన్ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యారు. గతంలో ఇలాంటి సందర్భం ఏదీ జరగలేదు. శ్రీలంకలో ఓ భారత వికెట్ కీపర్ హాఫ్ సెంచరీ మార్కును అధిగమించడం ఇది రెండోసారి. గతంలో ధోనీ, ఇప్పుడు వృద్ధిమాన్ సాహా సాధించాడు.

English summary
Having showed enormous amount of patience during his 134-run knock, Indian opener Shikhar Dhawan expressed great satisfaction in being able to show a different kind of batsmanship to the one people have been used to over last couple of years.
మీ వ్యాఖ్య రాయండి