Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

లంక 367 ఆలౌట్: గెలుపు ముంగిట భారత్ 23/1

Posted by:
Updated: Friday, August 14, 2015, 18:17 [IST]

గాలే: 176 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 ఓవర్లలో వికెట్ నష్టపోయి 23 పరుగులు చేసింది. తొలి టెస్టులో భారత్ విజయ లక్ష్యానికి 153 పరుగుల దూరంలోనే ఉంది. చేతిలో 9 వికెట్లు, ఆటకు మరో రెండు రోజులు మిగిలి ఉన్నాయి.

ప్రస్తుతం క్రీజులో శిఖర్ ధావన్ 13, ఇషాంత్ శర్మ 5 పరుగులతో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. హెర్నాత్ వేసిన 5వ ఓవర్‌లో కేఎల్ రాహుల్ 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఎల్‌బీడబ్ల్యుగా పెవిలియన్‌కు చేరాడు.

భారత్ - శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 367 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ ముందు 176 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓటమి నుంచి లంకను కాపాడేందుకు దినేశ్ చండీమల్ ఒంటరి పోరాటం చేసి 162 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

India vs Sri Lanka Live Score: 1st Test, Day 3 at Galle

కుమార సంగక్కర(40), మాధ్యూస్‌(39), తిరిమన్నే(44)తో కలిసి ఆరో వికెట్‌కు 125, ముబారక్‌(49) పరుగులు చేశారు. టీమిండియా స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రాలు వికెట్లు తీయడంలో కీలకపాత్ర పోషించారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఉంచిన నమ్మకాన్ని నిరూపిస్తూ అశ్విన్ ఈ మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లు తీసుకున్నాడు.

అశ్విన్‌ ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు తీయడం ఇది మూడోసారి కావడం విశేషం. మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లను తీసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ 4 వికెట్లు తీసుకోగా, అమిత్ మిశ్రా 3 వికెట్లు తీసుకున్నాడు. తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపని సీనియర్ స్ఫిన్నర్ హర్భజన్ సింగ్, ఆరోన్, ఇషాంత్ శర్మ తలో వికెట్ తీసుకున్నారు.

శ్రీలంక ఆటగాడు దినేశ్‌ చండీమల్‌ సెంచరీ సాధించాడు. వన్డే మ్యాచ్‌ తరహాలో వేగంగా పరుగులు చేస్తూ 100 బంతుల్లో 100 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఆరు వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. దినేశ్‌ చండీమల్‌(100), ముబారక్‌(24) పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

శ్రీలంక ప్రస్తుతం 74 పరుగుల ఆధిక్యంలో ఉంది. కానీ టీమిండియా స్పిన్నర్ శ్రీలంకను మరోసారి కష్టాల్లోకి నెట్టాడు. ప్రస్తుతం ఆతిథ్య జట్టు 6 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసి, భారత్ పై స్వల్ప ఆధిక్యం సంపాదించింది.

లంక చేతిలో మరో 4 వికెట్లే ఉండడంతో ఈ మ్యాచ్ లో టీమిండియా గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 220 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. 44 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తిరుమన్నే అశ్విన్ బౌలింగ్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

45 ఓవర్లు ముగిసే సరికే శ్రీలంక 5 వికెట్లను కోల్పోయి 192 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆధిక్యతను సమం చేసింది. 95 పరుగులకే 5 వికెట్లను కోల్పోయి కష్టాల్లో ఉన్ లంకను చండీమల్‌తో కలిసి తిరుమన్నే ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు ఆట ప్రారంభమైంది. తొలి బంతికే శ్రీలంక బ్యాట్స్‌మెన్ ప్రసాద్ 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అజ్యంకె రహానే బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. కుమార సంగక్కర 32, మాథ్యాస్ 24 పరుగులతో క్రీజులో ఉన్నారు.

5/2 ఓవర్ నైట్ స్కోరుతో శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. 192 పరుగుల ఫాలౌ‌న్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక వెంట వెంటనే ఓపెనర్లను కోల్పోయింది. ఓపెనర్లుగా వచ్చిన కరుణరత్నె, జెకె సిల్వ పరుగులేమి చేయకుండానే వెనుదిరిగారు. అశ్విన్ కరుణరత్నె వికెట్ తీయగా, మిశ్రా సిల్వ వికెట్ తీశాడు.

అంతకుముందు, గాలె అంతర్జాతీయ మైదానంలో భారత్‌-శ్రీలంక మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 375 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో భారత్ 192 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. రెండో రోజు 128/2 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ ఆరంభం నుంచే లంక బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు.

జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో ఇద్దరూ సెంచరీలు చేశారు. 255 పరుగుల వద్ద కోహ్లీ (103) వెనుదిరగడంతో 200 పరుగుల భాగస్వామ్యానికి అడ్డుకట్టపడింది. శిఖర్ ధావన్ (134)కు జత కలిసిన వృద్ధిమాన్ సాహా (60) రాణించాడు.

టెయిలెండర్లు ప్రతిఘటించినా భారీ స్కోరు సాధించడంలో విఫలమయ్యారు. దీంతో 375 పరుగుల వద్ద టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. శ్రీలంక బౌలర్లలో 5 వికెట్లతో కుశాల్ రాణించగా, 3 వికెట్లతో ప్రదీప్, చెరో వికెట్ తీసి ప్రసాద్, మాధ్యూస్ చక్కని సహకారమందించారు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 191 పరుగుల ఆధిక్యం సంపాదించుకుంది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 183 పరుగులు చేసింది.

రెండో రోజు ఆట వివరాల కోసం

తొలి టెస్ట్, డే2: శిఖర్, కోహ్లీ సెంచరీలు, 375 ఆలౌట్

Story first published:  Friday, August 14, 2015, 11:42 [IST]
English summary
Sri Lanka, trailing India by 192 runs in the first innings, were 5-2 from four overs in their second knock at stumps on the second day of the first Test on Thursday
మీ వ్యాఖ్య రాయండి