Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

కోహ్లీకి షాక్: చివర్లో చేతులెత్తేసిన భారత్ ఓటమి

Posted by:
Updated: Saturday, August 15, 2015, 13:55 [IST]

గాలే: భారత్-శ్రీలంక మధ్య జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమి పాలైంది. 63 పరుగుల తేడాతో భారత్‌పై లంక విజయం సాధించింది. 176 పరుగుల స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా లక్ష్య చేధనలో చేతులేత్తేసింది. శ్రీలంక బౌలర్ హెరాత్‌ దెబ్బకు భారత్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది.

23 /1 ఓవర్ నైట్ స్కోరుతో శనివారం ఆటను ప్రారంభించిన టీమిండియా 112 పరుగులకే ఆలౌట్ అయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సాహా రెండంకెల పరుగులు చేయడంలో విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో హెరాత్‌కు ఏడు వికెట్లు తీసుకోగా, కౌశల్‌కు మూడు వికెట్లు తీసుకున్నాడు.

 1st Test: Day 4 Virat Kohli Falls, India In Tatters

తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 183 పరుగులకే ఆలౌట్ అవగా, భారత్ 375 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 367 పరుగులు చేసి ఆలౌట్ అవగా, ఆ తర్వాత 176 పరుగుల స్వల్పలక్ష్యంతో నాలుగు రోజు ఆట ప్రారంభించిన టీమిండియా వరుస వికెట్లను కోల్పోయింది.

ఒకనొక దశలో 67 పరుగులకే ఏడు వికెట్లను కోల్పోయింది. దీంతో భారత్ ఒక్కసారిగా కష్టాల్లో పడింది. టీమిండియా ఆటగాళ్లలో శిఖర్ ధావన్(28), రోహిత్ శర్మ(4), విరాట్ కోహ్లీ(3), సాహా(2), హర్భజన్ సింగ్(1) వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది.

భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాల్గవ రోజు రెండో ఇన్నింగ్స్‌లో భారత టాప్ ఆర్డర్ తడబడుతుంది. గాలే టెస్టులో భారత్ ఆరో వికెట్‌ను కోల్పోయింది. 65పరుగుల వద్ద సాహా 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. 23 /1 ఓవర్ నైట్ స్కోరు తో ఈరోజు ఆటను ప్రారంభించింది. దీంతో 31.2 ఓవర్లకు గాను టీమిండియా 6 వికెట్లను కోల్పోయి 66 పరుగులు చేసింది.

తొలి టెస్టులో టీమిండియా విజయం సాధించాలంటే ఇంకా 110 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో 4 వికెట్లు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీలు సాధించిన శిఖర్ ధావన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో అభిమానులను నిరాశపర్చారు. నాల్గవ రోజు ఆట ప్రారంభానికి ముందు టీమిండియా జట్టు సభ్యులు, సిబ్బంది జాతీయ జెండాను ఆవిష్కరించి, అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు.

176 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 8 ఓవర్లలో వికెట్ నష్టపోయి 23 పరుగులు చేసింది. తొలి టెస్టులో భారత్ విజయ లక్ష్యానికి 153 పరుగుల దూరంలోనే ఉంది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక 367 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ ముందు 176 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

మూడో రోజు ఆట వివరాల కోసం

లంక 367 ఆలౌట్: గెలుపు ముంగిట భారత్ 23/1 

Story first published:  Saturday, August 15, 2015, 11:55 [IST]
English summary
Dominant India eye a big win against Sri Lanka in the first Test at Galle. With nine wickets left and only 153 runs needed more, Shikhar Dhawan would want to once again dominate and take his team to a convincing win.
మీ వ్యాఖ్య రాయండి