Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

తొలి టెస్ట్ విక్టరీ: సంగక్కరకు భావోద్వేగ వీడ్కోలు

Published: Sunday, August 16, 2015, 12:41 [IST]

గాలెం శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం కుమార సంగక్కరకు భావోద్వేగాల మధ్య వీడ్కోలు పలికారు. సంగక్కర సహచరులంతా భుజాలకెత్తుకోగా.. గ్యాలరీల్లోని ప్రేక్షకులు గౌరవసూచకంగా లేచి చప్పట్లు చరిచారు. విఐపి బాక్సులోంచి సంగక్కర భార్య, పిల్లలు భావోద్వేగానికి గురయ్యారు.

మొత్తంగా తన వేదికన చివరి టెస్టు ఆడిన వెటరన్ బ్యాట్స్‌మన్ సంగక్కరకు గాలె భావోద్వేగ వీడ్కోలు పలికింది. ఇక్కడ 23 టెస్టులాడిన సంగక్కర 51.91 సగటుతో 1921 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు సెంచరీలుండడం విశేషం.

Galle gives emotional farewell to Sangakkara

భారత్‌తో సిరీస్‌లోని రెండోటెస్టు ద్వారా సంగక్కర అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్న సంగతి తెలిసిందే. మిగతా క్రికెటర్ల మాదిరి కేకలు, గెంతుల ద్వారా తన ఆనందాన్ని బయటకు వ్యక్తం చేయని సంగక్కర చివరి వికెట్‌గా అమిత్ మిశ్రా ఔటవ్వగానే, పట్టలేని ఆనందంతో సహచరుల్ని ఆలింగనం చేసుకున్నాడు.

జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించిన హెరాత్, చందిమల్‌ను అభినందించాడు. ఆ తర్వాత సంగా వద్దువద్దంటున్నా.. సహచరులంతా అతణ్ని భుజాలపైనెత్తుకొని స్టేడియం మొత్తం కలియతిరిగారు. దీంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు లభించిన మాదిరిగానే సంగాకు కూడా వీడ్కోలు లభించినట్లయింది.

English summary
The Sri Lankan supporters and players present at the Galle International stadium gave a fitting farewell to Kumar Sangakkara playing his penultimate Test match at the very venue he made his debut 15 years ago.
మీ వ్యాఖ్య రాయండి