Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

టెస్ట్ క్రికెట్ అంటే ఇలాగే:'గెలుపు నుంచి ఓటమి'పై కోహ్లీ

Posted by:
Published: Sunday, August 16, 2015, 13:57 [IST]

గాలె: శ్రీలంకతో తొలి టెస్టులో ఓటమి పైన భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాట్సుమెన్‌ను తప్పుబట్టాడు. ఓటమికి తమదే బాధ్యత అని చెప్పాడు. మాథ్యూస్ సేన అద్భుతంగా ఆడిందని కితాబిచ్చాడు.

గాలే టెస్టులో ఓటమి అనంతరం అనంతరం కోహ్లీ నిర్వేదం ప్రదర్శించాడు. టెస్టు క్రికెట్ అంటే ఇలాగే ఉంటుందని కూడా వ్యాఖ్యానించాడు. కేవలం ఒక్క బ్యాడ్ సెషన్ మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడ్డాడు.

లంక సెకండ్ ఇన్నింగ్స్ లో తొలి ఐదు వికెట్లను పడగొట్టిన తర్వాత పరిస్థితులను నియంత్రణలోకి తెచ్చుకోలేకపోయామని అంగీకరించాడు. రంగన హెరాత్ అద్భుతమైన బౌలర్ అని, ఒత్తిడిలోనూ టీమిండియా బ్యాట్స్ మెన్ ఆటకట్టించాడని పేర్కొన్నాడు.

We were tentative, not fearless - Kohli

ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌ను గెలవడం మామూలు విషయం కాదని, ఆ ఘనత ఏంజెలో మాథ్యూస్‌కు, అతని జట్టుకు చెందుతుందన్నాడు. తమ ఓటమికి ఏ ఒక్కరినో నిందించలేమని చెప్పాడు. ఈ వైఫల్యం అందరిదీ అన్నాడు.

శ్రీలంక రెండో ఇన్నింగుస్లో తాము ఆరంభంలోనే ఐదు వికెట్లు పడగొట్టామని, మ్యాచ్‌లో అప్పటికి తామే మెరుగైన స్థితిలో ఉన్నామని చెప్పాడు. ఆ తర్వాత పరిస్థితులను తాము సద్వినియోగం చేసుకోలేకపోయామని చెప్పాడు. లంక నిలకడగా ఆడుతూ మ్యాచ్ పైన పైచేయి సాధించిందన్నాడు.

English summary
Kohli said he would not say that he missed an extra batsmen as he chose to field five bowlers and as many batsmen.
మీ వ్యాఖ్య రాయండి