Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

అది కాదు, నేనే లక్ష్మణ్‌లా ఆడేవాడిని: అజరుద్దీన్

Posted by:
Published: Monday, August 17, 2015, 11:28 [IST]

హైదరాబాద్‌: లక్ష్మణ్ తనలా బ్యాటింగ్ చేస్తాడని అందరూ అంటుండేవారిని, నిజానికి తానే లక్ష్మణ్‌లా అడేవాడినని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, మాజీ పార్లమెంటు సభ్యుడు మొహమ్మద్ అజరుద్దీన్ అన్నారు. దేశానికి హైదరాబాద్‌ ఎంతో మంది నాణ్యమైన క్రికెటర్లను అందించిందని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ నుంచి టీమిండియాకు ఆడిన వారిలో లక్ష్మణ్‌ ఉత్తమ క్రికెటర్‌ అని కొనియాడాడు.

హైదరాబాద్‌ వెటరన్‌ క్రికెటర్స్‌ సంఘం (హెచ్‌వీసీఏ) ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన క్రికెట్‌ కార్నివాల్‌లో అజరుద్దీన్‌, లక్ష్మణ్‌, వెంకటపతి రాజు సహా పలువురు మాజీ క్రికెటర్లను సన్మానించారు. ఇక హెచ్‌సీఏ ప్రోత్సాహం వల్లే ఈ స్థాయిలో ఉన్నానని లక్ష్మణ్‌ అన్నాడు.

భారతదేశ క్రికెట్ చరిత్రలో ఒక వెలుగువెలిగన మాజీ, ప్రస్తుత టెస్ట్, వన్డే, రంజీ క్రికెటర్‌లతో సికింద్రాబాద్‌లోని ఎఓసి సెంటర్‌లోని తాప్పర్ స్టేడియం ఆదివారంనాడు కళకళలాడింది. క్రికెట్ చరిత్రలో గత కొన్నేళ్ల పాటు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అనేకమందిని హైదరాబాద్ వెటరన్ క్రికెట్ సంఘం ఒకే వేదిక మీదికి చేర్చింది.

Azhar says he followed Laxman in batting

తాప్పర్ స్టేడియంలో జరిగిన ఈకార్యక్రమానికి మేటి క్రికెటర్‌లైన మహ్మద్ అజారుద్దీన్, వివిఎస్ లక్ష్మణ్, అర్షద్ ఆయుబ్‌తో పాటు దాదాపు 40 మంది ప్రస్తుత, మాజీ టెస్ట్, రంజీ క్రికెటర్‌లతో సందడిగా మారింది. హైదరాబాద్ వెటరన్ క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి విజయ్‌మోహన్‌రాజ్ మాట్లాడుతూ ఆసోసియేషన్ అధ్యక్షునిగా వ్యవహరించిన ఎఓసి సెంటర్‌కు 1963లో ప్రాతినిధ్యం వహించి, జాతీయ క్రికెట్‌లో రాణిస్తూ జట్టు కెప్టెన్‌గా రాణించి దాదాపు 20 సంవత్సరాలు రంజీ క్రికెట్‌లో రాణించిన కెప్టెన్ మనోహర్‌శర్మ జన్మదినం సందర్భంగా క్రికెట్ కార్నివాల్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రముఖ క్రికెటర్‌లను సత్కరించినట్టు తెలిపారు.

ఎఓసి సెంటర్‌లో మనోహర్ శర్మ క్రికెట్‌ను అభివృద్ధి చేయడంతో పాటు అనేక క్రికెట్‌గ్రౌండ్‌లను నిర్మించి అనేక మంది యువ క్రికెటర్‌లను ప్రోత్సాహం కల్పించిన వారిలో ఒకరని అన్నారు. ఆదివారం జరిగిన క్రికెట్ కార్నివాల్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్డినెన్స్ సర్వీసెస్‌లో డైరెక్టర్ జనరల్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన, మాజీ నార్త్‌జోన్ క్రికెటర్ లెఫ్టినెంట్ జనరల్ భరత్‌సిసోడియా విచ్చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్డినెన్స్ సర్విసెస్‌లో దాదాపు 10నుండి 12 మంది జాతీయ క్రికెటర్‌లు ఆర్మీ అధికారులుగా పనిచేశారని గుర్తుచేస్తూ మనోహర్ శర్మ కూడా ఆర్మీలో పనిచేస్తూ క్రికెట్‌లో అద్భుతంగా రాణించారన్నారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ అజారుద్దీన్, వివిఎస్ లక్ష్మణ్ ప్రసంగించారు.

English summary
Team India former captain and ex MP Mohammad Azharuddin said that he was the follower of VVS Laxman in batting.
మీ వ్యాఖ్య రాయండి