Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

భారత్‌కు మరో షాక్: గాయంతో శిఖర్ ధావన్ ఔట్

Posted by:
Published: Monday, August 17, 2015, 17:47 [IST]

గాలే: శ్రీలంక పర్యటనలో ఉన్న టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ శ్రీలంకతో జరగనున్న తదుపరి రెండు టెస్టులకు దూరం కానున్నాడు. చేతి గాయం కారణంగా ధావన్‌ మిగిలిన రెండు టెస్టులను ఆడటం లేదు.

తొలి టెస్టులో శిఖర్ ధావన్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే, చేతికి గాయం కావడంతో మిగతా రెండు టోస్టులకు అతను దూరం ఉండనున్నాడు. తొలి టెస్టు సమయంలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు దావన్ కుడి చేతికి చిన్నపాటి గాయమైంది.

 Shikhar Dhawan ruled out of Sri Lanka Test series

శిఖర్ ధావన్ నాలుగు వారాల నుంచి ఆరు వారాల విశ్రాంతి తీసుకోవాల్సి ఉంది. కాగా, సిరీస్ అనంతరం శిఖర్ ధావన్ మాట్లాడుతూ... తనకు గాయమైందని, ఆ గాయంతో బ్యాట్ పట్టడం ఒకింత ఇబ్బంది అయిందని చెప్పిన విషయం తెలిసిందే.

మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత జట్టు తొలి టెస్టును కోల్పోయిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీలు సెంచరీలతో ఆకట్టుకున్నారు. గెలుపు ఖాయమనుకున్న టెస్టులో టీమిండియా ఓడింది.

English summary
India's opening batsman Shikhar Dhawan was today ruled out of the remainder of the Test series against Sri Lanka due to a hand injury, the Board of Control for Cricket in India (BCCI) said.
మీ వ్యాఖ్య రాయండి