Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

వీడ్కోలు సమయం: సంగక్కరకు సచిన్ రిచ్ నివాళి

Posted by:
Published: Tuesday, August 18, 2015, 16:09 [IST]

న్యూఢిల్లీ: భారత్-శ్రీలంక మధ్య జరగనున్న రెండో టెస్టు మ్యాచ్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్న శ్రీలంక బ్యాటింగ్ దిగ్గజం కుమార సంగక్కరకు క్రికెట్ దిగ్గజాలు నీరాజనాలు పలుకుతున్నారు. తాజాగా కుమార సంగక్కర గురించి ఇండియన్ బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు.

క్రికెటర్‌గా కుమార సంగక్కర ప్రస్థానం అద్భుతమని తెలిపాడు. కెరీర్ తొలి రోజుల్లో విధ్యంసకర బ్యాటింగ్ చేయలేకపోయినా, ఆ తర్వాత రోజుల్లో పరుగుల వరద పారించాడని తెలిపాడు. సచిన్ మాట్లాడుతూ 'కుమార సంగక్కర బ్యాటింగ్ శైలి ప్రత్యేకం. మామూలుగా, ఎడమచేతి వాటం ఆటగాళ్ల బ్యాటింగ్ చూడముచ్చటగా ఉంటుంది. అయితే, నేను ప్రత్యర్థి జట్టులో ఉండడంతో సహజంగానే అతడి ఆటను ఆస్వాదించలేకపోయాను. సంగక్కరకు ప్రత్యర్థిగా ఆడడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నా. లంకేయులేక కాదు, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అతడు ఎందరో యువకులకు ఆదర్శప్రాయుడు' అని పేర్కొన్నాడు.

Sachin Tendulkar pays rich tribute to retiring Kumar Sangakkara

41ఏళ్ల సచిన్ టెండూల్కర్, సంగక్కర తన బ్యాటింగ్ కేరీర్‌ను సెకండ్ హాఫ్‌లో పరిగెత్తించాడని ప్రశంసించాడు. 'సంగక్కర బ్యాటింగ్ అధ్భుతం. అనుభవం పెరిగేకొద్దీ వన్నె తేలాడు. ప్రపంచ స్థాయి క్రికెటర్ అనేందుకు అదే సూచిక. ఎప్పుడు లంకతో ఆడినా, అతడు డేంజర్ మ్యాన్‌గా కనిపించేవాడు.' అని తెలిపాడు.

కుమార సంగక్కర‌లో ఓ ప్రత్యేకత ఉంది. క్రీజులో అసౌకర్యంగా కదులుతున్న సమయంలోనూ పరుగులు రాబట్టగల సామర్థ్యం అతని సొంతం. పరిస్థితులను తనకు అనుగుణంగా మార్చుకోవడంలో సంగక్కర మంచి దిట్ట అని కొనియాడారు. ఆగస్టు 20 నుంచి భారత్-శ్రీలంక మధ్య రెండో టెస్టు పీ సారా ఓవల్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్ అనంతరం కుమార సంగక్కర అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడు. 15ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు సేవలందించిన సంగక్కర 133 టెస్టు మ్యాచ్‌లాడి 12, 350 పరుగులు చేశాడు.

English summary
Legendary cricketer Sachin Tendulkar paid rich tributes to retiring Sri Lankan great Kumar Sangakkara by hailing the stylish southpaw as a role model for not just the Sri Lankans, but for cricketers across the world.
మీ వ్యాఖ్య రాయండి