Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ప్రేయసి దీపికను పెళ్లాడిన దినేష్ కార్తీక్(ఫొటోలు)

Updated: Wednesday, August 19, 2015, 17:32 [IST]

చెన్నై: భారత క్రికెటర్ దినేశ్ కార్తీక్, స్క్వాష్ స్టార్ దీపికా పళ్లికల్ వివాహం మంగళవారం క్రిస్టియన్ పద్ధతిలో జరిగింది. చెన్నైలో జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు కొద్దిమంది సన్నిహితులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు.

 Cricketer Dinesh Karthik marries squash player Dipika Pallikal

వివాహ వేడుకలో నవ వధువు దీపికా.. తెలుపు రంగు గౌన్ ధరించి మెరిసిపోయింది. కాగా, ఆగస్టు 20న తెలుగు నాయుళ్ల సంప్రదాయంలో వీరు మరోసారి పెళ్లాడనున్నారు.

 Cricketer Dinesh Karthik marries squash player Dipika Pallikal

అయితే దినేష్‌ కార్తీక్‌కు ఇది రెండో వివాహం. 2007లో తన బాల్య స్నేహితురాలు నిఖిత వంజరను దినేష్‌ ముంబైలో పెళ్లి చేసుకున్నాడు. వీరి మధ్య పొరపొచ్చాలు రావడంతో 2012లో విడిపోయారు.

 Cricketer Dinesh Karthik marries squash player Dipika Pallikal

కొన్నాళ్లు ఒంటరిగా ఉన్న దినేష్‌ కార్తీక్‌.. స్క్వాష్ స్టార్ దీపికా పళ్లికల్ ప్రేమలో పడ్డాడు. కార్తీక్‌, దీపిక కలిసి ఒకే ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ దగ్గర శిక్షణ తీసుకుంటున్న సమయంలో దగ్గరయ్యారు. అది కాస్తా పెళ్లి దాకా వచ్చింది.

2013 నవంబర్‌ 15న చెన్నై ఐటీసీ గ్రాండ్‌ చోళ హోటల్‌లో వీరి నిశ్చితార్థం సన్నిహితుల సమక్షంలో తొలుత హిందూ సంప్రదాయ పద్ధతిలో, తర్వాత సిరియన్‌ క్రిస్టియన్‌ పద్ధతిలో జరిగింది.

Story first published:  Wednesday, August 19, 2015, 11:37 [IST]
English summary
India's wicketkeeper-batsman Dinesh Karthik married squash player Dipika Pallikal on Tuesday (August 18). This was first of the two weddings for the couple.
మీ వ్యాఖ్య రాయండి