Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ధోనీ ఫీట్: 10వేల ఫీట్ల ఎత్తు నుంచి పారాచూట్ జంప్

Posted by:
Published: Wednesday, August 19, 2015, 13:52 [IST]

ఆగ్రా: భారత క్రికెట్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ సాహసం చేశాడు. యూపీలోని ఆగ్రాలో ఆర్మీ విమానం నుంచి పారాచూట్ సాయంతో జంప్ చేశాడు. పలు విన్యాసాలతో అలరించాడు. ధోనీకి ఇది తొలి జంప్.

ఆర్మీ శిక్షణలో భాగంగా మహేంద్ర సింగ్ ధోనీ అగ్రాలోని పారా ట్రూపర్స్ ట్రెయినింగ్ స్కూల్లో రెండు వారాలుగా శిక్షణ పొందుతున్నాడు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం ధోనీ ఏఎన్ 32 ఆర్మీ విమానం నుంచి 10వేల అడుగుల ఎత్తులో తొలి పారాచూట్ జంప్ చేశాడు.

అతడు మరో నాలుగు పారాచూట్ జంప్‌లు చేయాల్సి ఉంటుంది. 2011లో భారత సైన్యం గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ హోదాతో ధోనీని గౌరవించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ధోనీ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నారు.

MS Dhoni completes first para jump for Territorial Army

టెర్రిటోరియల్ ఆర్మీ (టిఏ)లో 106 పారాచూట్ రిజిమెంట్‌లో ధోనీ లెఫ్టినెంట్ కల్నల్‌గా ఉన్నారు. మహేంద్ర సింగ్ ధోనీ ఆగస్టు 6వ తేదీ నుంచి శిక్షణ పొందుతున్నాడు. తన లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంకుకు న్యాయం చేసేందుకు అతను పారాజంప్‌కు సిద్ధమయ్యాడు.

ఇది ప్రమాదకర ఫీట్ అని, వద్దని అధికారులు సూచించారు. అయితే, ధోనీ జంప్ చేసేందుకే సిద్ధమయ్యాడు. బుధవారం నాడు తొలి జంప్ చేశాడు. మరో నాలుగు జంప్‌లు చేయాల్సి ఉంది. మొత్తం అయిదుసార్లు జంప్ చేయాల్సి ఉంది.

English summary
Indian cricket captain Mahendra Singh Dhoni completed his first parachute jump from an Indian Air Force aircraft on Wednesday as part of his training with the Territorial Army.
మీ వ్యాఖ్య రాయండి