Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

రెండోటెస్ట్, డే1: రాహుల్ సెంచరీ, రోహిత్ ఔట్, భారత్319/6

Updated: Thursday, August 20, 2015, 19:11 [IST]

కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిలకడగా ఆడుతోంది. 12 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 11 బంతుల్లో 4 పరుగులు చేసిన రహానే.. ప్రసాద్ బౌలింగ్‌లో కరుణరత్నేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఓపెనర్‌గా వచ్చిన మురళీ విజయ్ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. అయినా కోహ్లీ, రాహుల్ నిలకడగా ఆడి భారత స్కోరును పరుగుపెట్టించారు.

2nd Test: Day 1: India lose Vijay and Rahane early

ఆ తర్వాత 78 పరుగులు చేసిన కోహ్లీ.. హెరాత్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం రాహుల్ 108 పరుగుల వద్ద చీమారా బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో 4 వికెట్లు కోల్పోయిన భారత్, 59.2 ఓవర్లకు 231 పరుగులు చేసింది.

ఆ తర్వాత 79 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. మాథ్యూస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. స్టూవర్ట్ బిన్నీ కూడా 10 పరుగులు చేసి హెరాత్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్రస్తుతం వృద్ధిమాన్ సాహా 19 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 87.2 ఓవర్లలో భారత్.. 6వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది.

Story first published:  Thursday, August 20, 2015, 11:57 [IST]
English summary
India captain Virat Kohli won the toss and elected to bat first against Sri Lanka in the 2nd Test here at P Sara Oval on Thursday.
మీ వ్యాఖ్య రాయండి