Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

రెండోటెస్ట్, డే2: భారత్ 393 ఆలౌట్, లంక 140/3

Updated: Friday, August 21, 2015, 17:53 [IST]

కొలంబో: రెండోటెస్టులో రెండో రోజైన శుక్రవారం భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్ కరుణరత్నే కేవలం 1 పరుగు చేసి యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 21 ఓవర్లలో శ్రీలంక 65 పరుగులు చేసి వికెట్ కోల్పోయింది.

32 పరుగులు చేసిన తర్వాత సంగక్కర.. అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం సిల్వ 51 పరుగులు చేసి మిశ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ప్రస్తుతం తిరిమన్నె 28, మాథ్యూస్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. 53 ఓవర్లలో లంక 3 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది.

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్ ముగించింది. 114 ఓవర్లు ఆడిన భారత్ 393 పరుగులు చేసి ఆలౌటైంది. 6 వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసిన టీమిండియ.. శుక్రవారం ఉదయం రెండో రోజు ఆట ప్రారంభించి 393 పరుగులు చేసి ఆలౌటైంది.

 2nd Test Day 2: Wriddhiman Saha Slams Gritty Fifty to Put India on Top

రెండో రోజు ఆట ఆరంభించిన తర్వాత 2 పరుగులు చేసిన అశ్విన్.. మాథ్యూస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం 24 పరుగులు చేసిన మిశ్రా.. చమీలా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. వృద్ధిమాన్ సాహా 56, ఇషాంత్ శర్మ 2 పరుగుల వద్ద హెరాత్ బౌలింగ్‌లో ఔటవడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. యాదవ్ 2 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

రెండో టెస్ట్ మొదటి రోజు ఆట వివరాలు..

Story first published:  Friday, August 21, 2015, 12:43 [IST]
English summary
That's the end of first session on the second day. Wriddhiman Saha's gritty fifty has taken India to 386 for eight in 111 overs. A good session for India considering that it is the tail-enders partnering Saha.
మీ వ్యాఖ్య రాయండి