Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

వీడ్కోలు: సంగక్కరకు టీమిండియా గౌరవ వందనం

Posted by:
Updated: Friday, August 21, 2015, 15:23 [IST]

కొలంబో: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్న శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కరకు టీమిండియా ఆటగాళ్లు గౌరవ వందనం పలికారు. భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా శుక్రవారం (ఆగస్టు 21)న కుమార సంగక్కర బ్యాటింగ్ చేసేందుకు వెళుతున్న సమయంలో కొలంబో స్టేడియం చప్పట్లతో మార్మోగింది.

కొలంబోలోని పి సారా ఓవల్ మైదానంలోకి అడుగుపెట్టగానే టీమిండియా ఆటగాళ్లు రెండు వైపులా లైన్‌లో నుంచొని చప్పట్లతో స్వాగతం పలికారు. 37ఏళ్ల కుమార సంగక్కర ఈ రెండో టెస్టు మ్యాచ్ ముగిసిన అనంతరం అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నారు.

Team India gives guard of honour for Kumar Sangakkara

ఈ నేపథ్యంలో కుమార సంగక్కర క్రీజులోకి అడుపెట్టేందుకు మైదానంలోకి రాగానే ప్రేక్షకులు లేచి నిలబడి తమ హర్షధ్వానాలతో సంగక్కర బ్యాటింగ్‌కు స్వాగతం పలికారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కరచాలనంతో సంగక్కరకు అభినందనలు తెలిపారు.

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్ ముగించింది. 114 ఓవర్లు ఆడిన భారత్ 393 పరుగులు చేసి ఆలౌటైంది. 6 వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసిన టీమిండియా. శుక్రవారం ఉదయం రెండో రోజు ఆట ప్రారంభించి 393 పరుగులు చేసి ఆలౌటైంది.

రెండో రోజు ఆట ఆరంభించిన తర్వాత 2 పరుగులు చేసిన అశ్విన్.. మాథ్యూస్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం 24 పరుగులు చేసిన మిశ్రా.. చమీలా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. వృద్ధిమాన్ సాహా 56, ఇషాంత్ శర్మ 2 పరుగుల వద్ద హెరాత్ బౌలింగ్‌లో ఔటవడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. 

తన కెరీర్‌లో చివరి టెస్టు అయిన 134వ టెస్టు అడుతున్న కుమార సంగక్కర మోడ్రన్ క్రికెట్‌లో ఉన్న అతి కొద్ది గొప్ప బ్యాట్స్ మెన్లలో ఒకడు. గురువారం (ఆగస్టు 20) నాడు లండన్‌లోని ఓవల్ మైదానంలో యాషెస్ టెస్టులో చివరిదైన 5వ టెస్టులో భాగంగా ఆస్టేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్‌కు ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఇదే విధంగా గౌరవ వందనం పలికారు.

మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్న శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర‌ను బీసీసీఐ సన్మానించింది. గురువారం ప్రారంభమైన రెండో టెస్టు ప్రారంభించడానికి ముందు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ సంగక్కరకు జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

టెస్టు క్రికెట్‌లో కుమార సంగక్కర 57.71 సగటుతో 12,350 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 38 సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డేల్లో 404 వన్డేలు ఆడిన సంగక్కర 41.98 సగటుతో 14, 234 పరుగులు చేశాడు.

Story first published:  Friday, August 21, 2015, 14:56 [IST]
English summary
Team India players lined up on the ground at the P Sara Oval on Friday (August 21) to give a guard of honour to the retiring Sri Lankan batsman Kumar Sangakkara during the 2nd Test.
మీ వ్యాఖ్య రాయండి