Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

భారత్ 87 పరుగుల ఆధిక్యం, లంక 306 ఆలౌట్

Posted by:
Updated: Saturday, August 22, 2015, 16:52 [IST]

కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ 87 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. 140/3 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 306 పరుగులకు ఆలౌటయ్యారు. మూడో రోజైన ఈరోజు మాథ్యూస్ (102) సెంచరీ, తిరుమన్నె (62) హాఫ్ సెంచరీలతో రాణించారు.

టీమిండియా బౌలర్లలో అమిత్ మిశ్రా 4, ఇషాంత్, అశ్విన్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 393 పరుగులు చేసింది. లంక ఓవర్ నైట్ బ్యాట్స్ మెన్ మాథ్యూస్, తిరుమన్నె నాలుగో వికెట్ కు 127 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు.

టీ విరామ సమాయానికి శ్రీలంక 7 వికెట్లను కోల్పోయి 298 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ముబారక్ 20, హెర్నాత్ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక చండీమల్‌ వికెట్‌ను కోల్పోయింది.

Rain stalls Mathews, Thirimanne stand

వర్షం అంతరాయం తర్వాత మ్యాచ్‌ తిరిగి ప్రారంభమైన స్వల్ప వ్యవధిలోనే ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో చండీమల్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో శతకం సాధించిన చండీమల్‌ రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 23 బంతుల్లో 11 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు.

102 పరుగులు చేసిన మాథ్యాస్, బిన్నీ బౌలింగ్‌లో మురళీ విజయ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. శ్రీలంక నాలుగో వికెట్‌ కోల్పోయింది. భోజన విరామం అనంతరం 84.5 ఓవర్‌ వద్ద ఇషాంత్‌ శర్మ వేసిన బంతికి తిరిమానె(62) సాహాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. శ్రీలంక 85 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 242 పరగులు చేసింది.

రెండో టెస్టు మూడో రోజుఆటకు వర్షం అంతరాయం కలిగించింది. భోజన విరామం అనంతరం మ్యాచ్‌ ప్రారంభించిన కొద్ది సేపటికే వర్షం కారణంగా మ్యాచ్‌ ఆగిపోయింది. కొలంబోలోని పి సారా ఓవల్ స్డేడియంలో భారత-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట కొనసాగుతోంది. 140/3 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక జట్టు నిలకడగా రాణిస్తోంది.

శ్రీలంక బ్యాట్స్‌మెన్ తిరుమానె 142 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. ప్రస్తుతం క్రీజులో తిరుమానె 59, మాథ్యూస్ 80 పరుగులతో ఉన్నారు. 82.3 ఓవర్లకు గాను శ్రీలంక జట్టు మూడు వికెట్లను కోల్పోయి 234 పరుగులు చేసింది. శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్ ముగించింది. 114 ఓవర్లు ఆడిన భారత్ 393 పరుగులు చేసి ఆలౌటైంది.

రెండో రోజైన శుక్రవారం భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం శ్రీలంక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్ కరుణరత్నే కేవలం 1 పరుగు చేసి యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 21 ఓవర్లలో శ్రీలంక 65 పరుగులు చేసి వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన తర్వాత సంగక్కర.. అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం సిల్వ 51 పరుగులు చేసి మిశ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

రెండో టెస్టు రెండో రోజు ఆట వివరాల కోసం

Story first published:  Saturday, August 22, 2015, 13:09 [IST]
English summary
Angelo Mathews and Lahiru Thirimanne kept India's bowlers at bay to improve Sri Lanka's chances of a big first innings total in the second Test in Colombo on Saturday.
మీ వ్యాఖ్య రాయండి