Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

యువ బౌలర్లతో సచిన్, మెక్‌గ్రాత్: 'చీకట్లో ఆడేవాడిని'

Posted by:
Published: Saturday, August 22, 2015, 13:24 [IST]

చెన్నై: ప్రస్తుత పోటీ ప్రపంచంలో కఠోరశ్రమ, అంకితభావంతో మాత్రమే ఫలితాలు సాధించగలమని సచిన్‌ టెండూల్కర్‌ యువ పేసర్లకు మార్గనిర్దేశం చేశాడు. ఎంఆర్‌ఎఫ్‌ పేస్‌ ఫౌండేషన్‌ (చెన్నై) నిర్వహించిన కార్యక్రమంలో ఆస్ర్టేలియా మాజీ పేసర్‌ గ్లెన్‌ మెక్‌గ్రాత్‌తో కలిసి పాల్గొన్న సచిన్‌ యువ బౌలర్లతో కాసేపు గడిపారు.

'మెక్‌గ్రాత్ లాంటి దిగ్గజం దగ్గర మెలకువలు నేర్చుకోవడం యువ బౌలర్లకు గొప్ప వరం. గత 27 ఏళ్లుగా ఎంఆర్‌ఎఫ్‌ పేస్‌ ఫౌండేషన్‌ క్రికెట్ కోసం ఎంతో కృషి చేస్తోంది. భారత క్రికెట్ ప్రతిభను మెరుగుపరచడంలో ఆ సంస్ధ పాత్రను ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నా' అని సచిన్ చెప్పాడు.

ఈ సందర్భంగా తన చిన్ననాటి రోజుల్ని గుర్తుకు తెచ్చుకున్నారు. తనకు భారత్‌కు ఆడాలన్న బలీయమైన కోరిక ఉండేదని, సమయం పూర్తయి చీకటిపడినా ఇంటికి వెళ్లకుండా అలాగే ప్రాక్టీస్‌ చేస్తూ ఉండేవాడినని చెప్పుకొచ్చారు.

Tendulkar, McGrath interact with trainees at MRF Pace Foundation

చీకటి పడింది వెళ్లమంటూ కోచ్‌ బలవంతంగా బయటికి నెట్టేసేవాడన్నారు. అలాగే తన కుటుంబ సభ్యులు, కోచ్‌ నుంచి ఎంతో మద్దతు ఉండేదని సచిన్‌ చెప్పాడు. కాగా 27 వసంతాలు పూర్తిచేసుకున్న ఎంఆర్‌ఎఫ్‌ పేస్‌ పౌండేషన్‌ను సచిన్‌ ఈ సందర్భంగా అభినందించారు.

ఎంఆర్‌ఎఫ్‌ పేస్‌ ఫౌండేషన్‌ (చెన్నై)కు 2012 నుంచి మెక్‌గ్రాత్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా మెక్‌గ్రాత్ మాట్లాడుతూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలనుకోవడం బాగుందని, అయితే ఐదో బౌలర్ ఆల్ రౌండరైతే జట్టు కూర్పు బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.

దూకుడైన క్రికెట్ ఆడతామని కెప్టెన్ విరాట్ కోహ్లీ తరచుగా చేసే వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని, సానుకూలంగా ఆడాలన్నది ఆతని మాటల ఉద్దశ్యమని మెక్‌గ్రాత్ కోహ్లీకి మద్దతు పలికాడు.

English summary
Batting legend Sachin Tendulkar today gave an insight into the grind of international cricket to the MRF Pace Foundation trainees and said hard work and dedication is the way to succeed in this tough, competitive world.
మీ వ్యాఖ్య రాయండి