Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

పాక్-భారత్ సిరీస్ కోసం ఏం చేయలేం: జహీర్

Published: Tuesday, August 25, 2015, 12:34 [IST]

కరాచీ: భారత్‌-పాకిస్థాన్ సంబంధాలను పునరుద్ధరించే విషయంలో జోక్యం చేసుకోలేమని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసిసి) అధ్యక్షుడు జహీర్‌ అబ్బాస్‌ స్పష్టం చేశాడు. పాక్‌తో సిరీస్‌ ఆడేందుకు భారత్‌ నిరాకరిస్తుండడంతో.. ఈ విషయాన్ని ఐసిసి దృష్టికి తీసుకెళ్లనున్నట్టు పిసిబి సంకేతాలిచ్చింది.

కాగా, ‘ద్వైపాక్షిక సిరీస్‌లు అనేవి రెండు బోర్డుల మధ్య జరిగే విషయం. ఐసిసి వారితో చర్చించగలదు. కానీ ఆడే విధంగా ఒత్తిడి చేయలేదు' అని జహీర్‌ మీడియాతో చెప్పాడు.

 ICC cannot compel a board to play bilateral series: Zaheer Abbas

రెండు బోర్డుల మధ్య జరిగిన ఎంవోయూను గౌరవించాలని పిసిబి ఛైర్మన్‌ షహర్యార్‌ ఖాన్‌.. బిసిసిఐకి లేఖ రాసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

ఒకవేళ భారత బోర్డు నుంచి కచ్చితమైన సమాధానం రాకుంటే.. ఐసిసి ముందు ఈ విషయాన్ని లేవనెత్తాలని పాక్‌ బోర్డు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అయితే, ఈ నేపథ్యంలోనే జహీర్ అబ్బాస్ పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

English summary
With the PCB indicating that it may raise the issue of India not agreeing on a bi-lateral series in the UAE with the ICC, the cricket world body's President Zaheer Abbas on Tuesday made it clear that they cannot be compelled to play against each other.
మీ వ్యాఖ్య రాయండి