Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

భారత్-పాక్ మధ్య గొడవలు ఎప్పుడు ఉండేవే: సిరీస్‌పై పాక్ ఆశలు

Posted by:
Published: Wednesday, August 26, 2015, 15:54 [IST]

కరాచీ: భారత్ - పాకిస్తాన్ క్రికెట్ సిరీస్ పైన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఇంకా ఆశలు పెట్టుకుంది. తీవ్రవాదం, సరిహద్దుల్లో రెచ్చిపోతున్న పాకిస్తాన్, దావూద్ ఇబ్రహీం తదితర అంశాల నేపథ్యంలో పాకిస్థాన్ తీరును భారత్ పలుమార్లు తప్పుబట్టింది. పాక్ ఈ విషయంలో బుకాయిస్తోంది.

ఇది ఇరు దేశాల క్రికెట్ సిరీస్ పైన కూడా ప్రభావం చూపింది. మా ప్రజల కంటే క్రికెట్ ముఖ్యం కాదని బిసిసిఐతో పాటు మాజీ ఆటగాళ్లు కూడా స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితమే పిసిబి సిరీస్ పైన ఆశలు వదిలేసుకుంది. అయితే తాజాగా మరోసారి ఆశలు పెట్టుకుంది. డిసెంబర్‌లో దాయాదుల మధ్య క్రికెట్ సమరం జరగాల్సి ఉంది. అయితే, ఉధంపూర్ ఘటనకు తోడు, దావూద్ పాకిస్తాన్లోనే ఆశ్రయం పొందుతున్నాడన్న నేపథ్యంలో సిరీస్ పైన ప్రభావం పడింది.

Status of Indo-Pak series will be clear in September: PCB

అయినప్పటికీ, సిరీస్ జరుగుతుందని పీసీబీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. దీనిపై వచ్చే నెలలో స్పష్టత వస్తుందని పీసీబీ ప్రముఖుడు నజామ్ సేథీ చెప్పాడు.

భారత రాజకీయనేతలు చేసే ప్రకటనలను కానీ, మీడియాలో వచ్చే కథనాలను కానీ తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని ఆయన అన్నాడు. భారత్, పాకిస్తాన్ మధ్య ఇలాంటి గొడవలు ఎప్పుడూ ఉండేవేనని చెప్పాడు.

సిరీస్ రద్దు చేయాల్సి వచ్చేంత తీవ్రస్థాయిలో పరిస్థితేమీ లేదని, సెప్టెంబరులో న్యూయార్క్‌లో జరిగే ఐక్య రాజ్య సమితి సమావేశంలో ఇరు దేశాల ప్రధానులు, ఇతర అధికారులు చర్చలు జరిపే అవకాశాలున్నాయని, ఆ సందర్భంగా వాతావరణం తేలికపడుతుందని భావిస్తున్నామని చెప్పాడు.

English summary
The Pakistan Cricket Board has ruled out an immediate first-class return for the tainted duo of Salman Butt and Muhammad Asif, saying that they would have to attend further anti-corruption rehabilitation programs to regain the PCB’s trust.
మీ వ్యాఖ్య రాయండి