Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

‘టక్ టక్’ నడిపిన భజ్జీ: కోహ్లీ, బిన్నీ షికారు(ఫొటో)

Published: Wednesday, August 26, 2015, 9:26 [IST]

కొలంబో: శ్రీలంకపై గాలె టెస్ట్‌లో గెలుపు తృటిలో చేజారినా.. రెండో టెస్ట్‌లో భారీ విజయం టీమిండియా ఆటగాళ్లలో నూతనోత్తేజాన్ని నింపింది. ఈ గెలుపును భారత క్రికెటర్లు బాగానే ఆస్వాదిస్తున్నారు.

మంగళవారం ఆటగాళ్లు తమకు తోచిన విధంగా సంతోషంగా గడిపారు. వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ స్వయంగా ఆటోరిక్షాను నడుపుతూ జట్టు సహచరులతో కలిసి కొలంబో వీధుల్లో షికారు చేశాడు.

When Virat, Harbhajan took autorickshaw in Sri Lanka

స్థానిక శ్రీలంక వాసులు ఆటో రిక్షాను ‘టక్‌ టక్‌' అని పిలుస్తారు. ఈ రైడ్‌లో భజ్జీతో పాటు కెప్టెన్‌ విరాట్ కోహ్లీ, స్టువర్ట్ బిన్నీ ఉన్నారు.

ఈ ఫొటోను హర్భజన్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. తర్వాత భజ్జీ, భువనేశ్వర్‌, ఇషాంత్‌ శర్మ, ఛటేశ్వర్‌ పుజారాతో కలిసి కోహ్లీ బ్యాడ్మింటన్‌ ఆడాడు. కాగా, ఆగస్టు 28 నుంచి శ్రీలంక-భారత్‌ మధ్య ఆఖరిదైన మూడో టెస్ట్‌ జరగనుంది.

English summary
Team India seems to be relishing their win over Sri Lanka in the second Test match at Colombo.
మీ వ్యాఖ్య రాయండి