Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

చెన్నైకి చుక్కెదురు: స్టే ఇచ్చేందుకు నిరాకరణ

Posted by:
Published: Thursday, August 27, 2015, 17:45 [IST]

చెన్నై: ఐపీఎల్ నుంచి నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌ను రెండేళ్ల నిషేధంపై స్టే ఇచ్చేందుకు మద్రాసు హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

సుప్రీం కోర్టు నియమించిన ఆర్ఎమ్ లోథా కమిటీ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల యజమానులైన గురునాథ్ మేయప్పన్, రాజ్ కుంద్రాలు ఫిక్సింగ్ చేశారని తేలడంతో రెండు జట్లను రెండేళ్ల పాటు ఐపీఎల్‌ నుంచి నిషేధించిన సంగతి తెలిసిందే.

Chennai Super Kings Petition to Stay Indian Premier League Suspension Rejected by Madras High Court

సెప్టెంబర్ 23కు ఈ కేసును వాయిదా వేశారు. చీఫ్ జస్టిస్ సంజయ్ విషన్ కౌల్, జస్టిస్ టీఎస్ శివంగ్నానమ్ సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ కేసును వాయిదా వేస్తూ తీర్పు వెల్లడించారు. అయితే బీసీసీఐ నిర్ణయం వెలువడిన తర్వాత ఈ జట్ల నిషేధంపై తీర్పు వెల్లడించడానికి వీలుంటుంది.

ఇక, ఆగస్టు 28న బీసీసీఐ వర్కింగ్ కమిటీ సభ్యులు ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌పై ఓ నిర్ణయాన్ని తీసుకునేందుకు కోల్‌కత్తాలో సమావేశం కానున్నారు. సమావేశ అనంతరం బీసీసీఐ వెల్లడించే నిర్ణయాన్ని బట్టి ఆ జట్లపై తుది నిర్ణయాన్ని జట్టు సభ్యులకు సూచనలిస్తారు.

English summary
In a setback to Chennai Super Kings, the Madras High Court has refused interim relief to Chennai Super Kings Cricket Ltd. (CSKCL), which in a petition had sought for a stay on the two-year suspension slapped on the former Indian Premier League champions by the Justice RM Lodha panel.
మీ వ్యాఖ్య రాయండి