Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఎవరికీ ఏ స్థానం సొంతంకాదు, పరిస్థితిని బట్టి నిర్ణయం

Posted by:
Published: Thursday, August 27, 2015, 18:08 [IST]

కొలంబో: భారత క్రికెట్ జట్టులో ఏ ఒక్కరికీ ఓ స్థానం అని కచ్చితంగా ఉండదని టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి గురువారం చెప్పాడు. రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. గత రెండేళ్లలో ఇంత చక్కని బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూడలేదన్నాడు.

ముఖ్యంగా రెండో టెస్ట్ రెండు, మూడో రోజుల్లో అన్నాడు. వికెట్ తీయకపోయినప్పటికీ బాగా వేశారన్నాడు. ఎప్పుడైతే వికెట్లు పడ్డాయో అప్పుడు శ్రీలంక పైన ఒత్తిడి ప్రారంభమైందన్నాడు. తర్వాతి మ్యాచులోను వారు అలానే ఆడుతారన్నాడు.

In India's Test team, no one 'owns' a batting position: Ravi Shastri

శ్రీలంకతో చివరి టెస్టుకు ముందు కొలంబోలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీమిండియా డైరక్టర్ రవిశాస్త్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఇప్పుడున్న జట్టులో ఎవరికీ ఏ స్థానం సొంతం కాదన్నాడు.

పరిస్థితిని బట్టి బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు జరుగుతాయన్నాడు. పరిస్థితిని అనుసరించి ఎవరి అవసరం ఉంటుందో వారినే బ్యాటింగ్‌కు పంపుతామని, బౌలింగ్ విభాగానికీ ఈ సూత్రం వర్తిస్తుందన్నాడు. గాలే టెస్టులోనూ గెలుపే లక్ష్యంగా బరిలో దిగామని, కొలంబో టెస్టులోనూ అందులో మార్పులేదన్నాడు.

English summary
Team Director Ravi Shastri today termed the performance of the Indian bowlers in the second Test against Sri lanka as the "best in the last couple of years" and hoped for a repeat show in the series-decider.
మీ వ్యాఖ్య రాయండి