Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

మద్యం మత్తు: మరో వ్యక్తి కారులో బ్రెండన్ టేలర్ నిద్ర!

Published: Friday, August 28, 2015, 17:24 [IST]

లండన్: ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్ ఆడేందుకు అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్ విచిత్రమైన పరిస్థితిలో దొరికిపోయాడు. మద్యం మత్తులో ఉన్న బ్రెండన్ టేలర్.. లాక్ వేయని ఓ కారులో నిద్రపోయాడని అక్కడి పోలీసులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే.. టేలర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నాటింగ్ హామ్ షైర్ రాయల్ లండన్ వన్డే కప్ క్వార్టర్ ఫైనల్లో డుర్హాంపై జయభేరి మోగించింది. ఆ సందర్భంగా నాటింగ్ హామ్ షైర్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. విజయోత్సవం అంటే మద్యం ఉండకుండా ఎలా ఉంటుంది? అందుకే టేలర్ కూడా ఆ మత్తును ఎంజాయ్ చేశాడు.

పీకలదాకా తాగిన టేలర్, కిక్కు తలకెక్కడంతో అక్కడ కనిపించిన ఓ షెవర్లే మాటిజ్ కారులో పడుకుని నిద్రపోయాడు. కారు సొంతదారు మైకేల్ విటేకర్ డోర్ తెరిచి చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు.

Brendan Taylor found sleeping in a car

‘ఎవరో వ్యక్తి కారు వెనుక సీట్లో పడుకుని గుర్రు పెడుతున్నాడు(మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి ఓ ప్రముఖ క్రికెటర్ అని విటేకర్‌కు తెలియదు) అని పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసులు అక్కడి చేరుకున్న తర్వాత అతడో స్టార్ క్రికెటర్ అని తెలియడంతో విటేకర్ ఆశ్చర్యపోయాడు. ఓ ఇంటర్నేషనల్ క్రికెటర్ మన కార్లో పడుకుని ఉంటే ఎలా ఉంటుంది? అంటూ ఆ ఘటనను ఓ తమాషాగా పేర్కొన్నాడు విటేకర్. కాగా, బ్రెండన్ టేలర్ కూడా జరిగిన దానికి క్షమాపణలు చెప్పి తన గౌరవం నిలుపుకున్నాడు.

English summary
Former Zimbabwe skipper Brendan Taylor, who quit playing international cricket to play English county cricket, was found sleeping in an unlocked car by local police here on Friday.
మీ వ్యాఖ్య రాయండి