Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ధోనీ సడన్ రిటైర్మెంట్ వెనుక ఇదీ, తెలిసిందా!: రవిశాస్త్రి

Posted by:
Published: Friday, August 28, 2015, 16:27 [IST]

కొలంబో: మహేంద్ర సింగ్ ధోనీ టెస్టుల నుంచి హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడం వెనుక ఉన్న కారణాన్ని భారత క్రికెట్ జట్టు డైరెక్టర్ రవిశాస్త్రి వెల్లడించాడు! అప్పట్లో ధోనీ హఠాత్తుగా టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.

దీనిపై రవిశాస్త్రి మాట్లాడాడు. టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీ సరైన సమయంలో తప్పుకున్నాడని చెప్పాడు. మూడు ఫార్మాట్లలో ఆడడం ధోనీకి చాలా కష్టమని, దానికి తోడు టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించడానికి ఒకరు (కోహ్లీ) సిద్ధంగా ఉన్నారన్న విషయం కూడా అతనికి తెలుసన్నాడు.

Ravi Shastri reveals truth behind MS Dhoni's sudden Test retirement!

అందుకే మరేమీ ఆలోచించకుండా ఐదు రోజుల ఫార్మాట్లో సారథ్య బాధ్యతలను వదులుకున్నాడని చెప్పాడు. ధోనీ ఎందుకు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడో ఇప్పుడందరికీ అర్థమవుతుందనుకుంటానని చెప్పాడు. ధోనీ తప్పుకోవడానికి ఇది కూడా ఓ కారణమని చెప్పాడు.

ఆసీస్ పర్యటన సందర్భంగా భారత జటటులో లుకలుకలు తలెత్తాయని, జట్టులో గ్రూపిజం నెలకొందని, ధోనీకి, కోహ్లీకి పొసగడం లేదని మీడియాలో కథనాలు వచ్చిన విషయం తెలిసిందే.

English summary
Team India director Ravi Shastri on Thursday revealed reasons behind MS Dhoni's sudden retirement from Test cricket during India's tour Down Under earlier in the year.
మీ వ్యాఖ్య రాయండి