Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

కొలంబో టెస్టు డే 2: పుజారా సెంచరీ, భారత్ 292/8

Posted by:
Updated: Saturday, August 29, 2015, 17:44 [IST]

కొలంబో: భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 8 వికెట్ల నష్టానికి 292 పరుగులు సాధించింది. పూజారా (135 నాటౌట్), ఇషాంత్ శర్మ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు.

చివర్లో అమిత్ మిశ్రా 59 పరుగులతో రాణించాడు. కెప్టెన్ కోహ్లీ 18, రోహిత్ శర్మ 26 విఫలమయ్యారు. 214 బంతులు ఎదుర్కొన్న పుజారా 100 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు ఉన్నాయి. టెస్టులో పుజారాకు ఇది 7వ శతకం.

Sri Lanka vs India 3rd Test, day 2: Pujara and Rohit battle testing conditions

గత కొంతకాలంగా ఫామ్‌లేక ఇబ్బంది పడుతున్న పుజారా సెంచరీ సాధించి ఫామ్‌లోకి రావడం భారత జట్టులో ఆనందం నింపింది. ఇప్పటివరకు 28 మ్యాచ్‌లాడిన పుజారా 49.40 సగటుతో 2174పరుగులు సాధించాడు. 206 పరుగులు టాప్‌ స్కోరు.

పరుగుల వేటలో టీమిండియా తడబడుతోంది. 77 ఓవర్లకు 7 వికెట్లను కోల్పోయి భారత్ 220 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో ప్రసాద్ 4, ప్రదీప్, మాథ్యూస్, కౌశల్, హెర్నాథ్ తలో వికెట్ తీసుకున్నారు.

భోజన విరామ సమయానికి టీమిండియా స్కోరు 119/4

భారత్, శ్రీలంక మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భోజన విరామ సమయానికి భారత్ 4 వికెట్లను కోల్పోయి 119 పరుగులు చేసింది. రాహుల్ 2, రహానే 8, విరాట్ కోహ్లీ 18, రోహిత్ శర్మ 26 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరారు.

రోహిత్ శర్మ ఔట్:

119 పరుగుల వద్ద భారత్ నాల్గవ వికెట్ కోల్పోయింది. 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ శర్మ ప్రసాద్ బౌలింగ్‌లో తరంగకు క్యాచ్ ఇచ్చి ఔటవ్వడంతో టీమిండియా నాల్గవ వికెట్ కోల్పోయింది. భారత బ్యాట్స్‌మెన్స్ నిలకడగా రాణిస్తున్నారు. పూజారా 133 బంతుల్లో 5 ఫోర్లతో అర్ధసెంచరీని పూర్తి చేశాడు.

విరాట్ కోహ్లీ ఔట్:

64 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విరాట్ కోహ్లీ మాథ్యూస్‌ బౌలింగ్‌లో పెరెరాకు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. తొలి రోజు వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయే సమయానికి టీమిండియా 15 ఓవర్లకు గాను రెండు వికెట్లను నష్టపోయి 50 పరుగులు చేసింది.

కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక బౌలింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.

తొలి రోజు ఆట వివరాల కోసం 

భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), కెఎల్ రాహుల్, ఛటేశ్వర పుజారా, అజింక్యా రహానే, రోహిత్ శర్మ, స్టార్ట్ బిన్నీ, నమన్ ఓఝా (వికెట్ కీపర్), అశ్విన్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, అమిత్ మిశ్రా

శ్రీలంక జట్టు: మాథ్యూస్ (సారథి), కరుణరత్నే, కౌషల్ సిల్వ, ఉపుల్ తరంగ, లహిరు తిరమన్నే, దినేష్ చండీమల్, కౌషల్ పెరారే (వికెట్ కీపర్), ధమ్మిక ప్రసాద్, నువాన్ ప్రదీప్, తరిందు కౌషల్, రంగన హెరాత్

Story first published:  Saturday, August 29, 2015, 12:01 [IST]
English summary
Wicketkeeper-batsman Naman Ojha made his Test debut while Cheteshwar Pujara made a comeback as India were invited to bat first by Sri Lanka captain Angelo Mathews in the 3rd and final Test at the Sinhalese Sports Club (SSC) here on Friday.
మీ వ్యాఖ్య రాయండి