Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

3వ టెస్ట్, డే4: భారత్ 385, తడబడుతున్న లంక

Updated: Monday, August 31, 2015, 19:15 [IST]

కొలంబో: శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో సోమవారం నాలుగో రోజు లంక బ్యాటింగ్ తడబాటుకు గురైంది. ఓపెనర్‌గా వచ్చిన తరంగ.. ఇషాంత్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత కరుణరత్నే 0, చండీమాల్ 14 పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం సిల్వ 24, మాథ్యూస్ 22 పరుగులతో ఆట కొనసాగిస్తున్నారు. 18.1 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయిన లంక 67 పరుగులు చేసింది.

అంతకుముందు 274 పరుగులు చేసిన భారత్ ఆలౌటైంది. కాగా, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఉండటంతో శ్రీలంక టార్గెట్ 385 అయింది. మొదట ఓపెనర్లుగా వచ్చిన పుజారా పరుగులేమీ చేయకుండానే వెనుదిరుగగా, కెఎల్ రాహుల్ 2 పరుగులు చేసి ఔటయ్యాడు.

3rd Test, Day 4, India vs Sri Lanka - Rohit Sharma departs after scoring fifty

అజింక్యా రహానే 4, విరాట్ కోహ్లీ 21 పరుగులు చేసి ఔటయ్యారు. కాగా, 50 పరుగులు చేసిన రోహిత్ శర్మ..  ప్రసాద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 49 పరుగుల వద్ద స్టువర్ట్ బిన్నీ, 35 పరుగుల వద్ద ఓజా ఔటయ్యాడు. అనంతరం మిశ్రా 39, అశ్విన్ 58 పరుగులు చేసి ఔటయ్యారు.  

యాదవ్ 4 పరుగులు చేసి ఔటవగా, 2 పరుగులతో శ్రీషాంత్ అజేయంగా నిలిచాడు. కాగా, శ్రీలంక బౌలర్లలో ప్రదీప్ 3, ప్రసాద్ 3, హెరాత్ ఒక వికెట్ పడగొట్టారు.

తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 312 పరుగులు చేయగా, శ్రీలంక 201 పరుగులు చేసింది.

Story first published:  Monday, August 31, 2015, 12:04 [IST]
English summary
Welcome to our live cricket blog for Day 4 of the 3rd Test between India and Sri Lanka at Colombo.
మీ వ్యాఖ్య రాయండి