Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

మేమంతా ఒకటే, క్రికెట్‌కి మద్దతివ్వండి: అమెరికాలో ధోనీ

Posted by:
Published: Monday, August 31, 2015, 18:37 [IST]

వాషింగ్టన్: భారత క్రికెట్ జట్టుకు అభిమానులు ఎప్పుడూ మద్దతు పలకాలని, తామంతా ఒకటేనని భారత క్రికెట్ సారథి మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. ఆయన తన భార్య సాక్షితో కలిసి ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. భారతీయులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. భారత క్రికెట్ జట్టుకు అభిమానుల మద్దతు ఎప్పుడూ ఉండాలన్నాడు. టీమిండియా ఎప్పుడు కలిసి కట్టుగానే ఉందని చెప్పాడు. తమది మంచి టీం అని చెప్పాడు. ప్రతి ఆటగాడు విజయం కోసం కృషి చేస్తాడన్నాడు.

Keep supporting India, we have a good team: Dhoni

క్రికెట్‌ను, క్రికెటర్లను ఇంతగా ప్రేమించే అభిమానులు ఉండటం క్రికెటర్ల అదృష్టమని చెప్పాడు. తాను ఎన్నో దేశాలు తిరిగానని, క్రికెట్ ఆటలో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఇలా ఎన్నో తిరిగానని చెప్పాడు. అమెరికాలో పర్యటించడం వేరు అన్నాడు.

అమెరికన్ భారతీయులు సాధిస్తున్న దానితో దేశం ఎంతో గర్విస్తోందని చెప్పాడు. కాగా, మహేంద్ర సింగ్ ధోనీ తన భార్య సాక్షితో కలిసి అమెరికాలోని సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం అతడు విలేకరులతో మాట్లాడారు.

English summary
In a rare public appearance in the US, Indian ODI captain Mahendra Singh Dhoni interacted with the diaspora here and called on them to keep supporting the cricket team, which he said is going through a lot of changes.
మీ వ్యాఖ్య రాయండి