Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

భారత్, దక్షిణాఫ్రికా మధ్య ‘గాంధీ-మండేలా సిరీస్’

Published: Tuesday, September 1, 2015, 13:21 [IST]

న్యూఢిల్లీ: తమ తమ దేశాలను బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేసి ప్రపంచానికే మార్గదర్శకులుగా నిలిచిన మహాత్మా గాంధీ, నెల్సన్ మండేలాల గౌరవార్థం ఇకనుంచి భారత్, సౌతాఫ్రికా మధ్య అన్ని ద్వైపాక్షిక సిరీస్‌లకు గాంధీ-మండేలా సిరీస్ అని నామకరణం చేశాయి ఇరు దేశాల క్రికెట్ బోర్డులు.

ఇరు దేశాలకు జాతిపితలైన గాంధీ, మండెలా పేర్లను క్రికెట్ సిరీస్‌కు పెట్టడం ఎంతో ఆనందకరంగా ఉందని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ), క్రికెట్ సౌత్ ఆఫ్రికా (సిఎస్‌ఎ) విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో వివరించాయి.

India and South Africa to play for 'Gandhi-Mandela' series

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా శాంతియుత విప్లవానికి నాయకత్వం వహించిన మహాత్ముడు అందరికీ ఆరాధ్యుడని పేర్కొన్నాయి. అదే విధంగా దక్షిణాఫ్రికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా మండలా అలుపులేని పోరాటాన్ని జరిపాడని తెలిపాయి. వీరిద్దరి పేరుమీద సిరీస్ నిర్వహించడం ఎంతైనా సమంజసమని వివరించాయి.

ఈ సందర్భంగా బిసిసిఐ అధ్యక్షుడు దాల్మియా మాట్లాడుతూ.. ‘ఇరు దేశాలు స్వాతంత్య్రం కోసం పోరాటం చేశాయి. అహింసా, సహాయ నిరాకరణలే అయుధాలుగా చేసుకుని గాంధీ, మండేలాలు మన దేశాలకు స్వాతంత్య్రం సాధించారు. మనందరికీ మార్గదర్శకులైన వారికి ఈ సిరీస్ అంకితం చేస్తున్నాం' అని పేర్కొన్నారు.

English summary
The BCCI and Cricket South Africa (CSA) have announced that they will title all future bilateral series between the two countries - 'The Mahatma Gandhi-Nelson Mandela Series'.
మీ వ్యాఖ్య రాయండి