Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఇబ్బందుల్లో ఇషాంత్, ముగ్గురు లంక ఆటగాళ్లు

Posted by:
Published: Tuesday, September 1, 2015, 11:21 [IST]

కొలంబో: భారత్, శ్రీలంక మధ్య జరుగుతోన్న మూడో టెస్టులో ఐసీసీ నిబంధలను ఉల్లంఘంచినందుకు గాను నలుగురు ఆటగాళ్లకు జరిమానా విధించారు. అందులో ముగ్గురు శ్రీలంక ఆటగాళ్లతో పాటు ఇషాంత్ శర్మ ఉన్నారు. ఈ విషయాన్ని ఐసీసీ తన ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలియజేసింది.

జరిమానా విధించిన వారిలో చంఢీమాల్, ఇషాంత్ శర్మ, లాహిరు తిరుమన్నే, ప్రసాద్‌లు ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మూడో టెస్టు మ్యాచ్ పూర్తైన తర్వాత ఐసీసీ వెల్లడించనుంది. సోమవారం (ఆగస్టు 31)న చివరి ఓవర్లో బ్యాటింగ్ చేస్తున్న ఇషాంత్‌ శర్మకు అతను వరుసగా మూడు బౌన్సర్లు విసిరాడు.

బౌన్సర్ల నుంచి తప్పించుకున్న ఇషాంత్ శర్మ బౌలర్ వైపు చిరునవ్వు నవ్వాడు. ఆ తర్వాతి బంతిని సింగిల్ తీసిన శర్మ...మరో బౌన్సర్ వేస్తావా అన్నట్లుగా తన తల వైపు చూపించాడు. అయితే రన్ పూర్తి కాగానే ప్రసాద్ ఏదో అనడంతో ఇషాంత్ బదులిచ్చాడు.

Ishant Sharma, 3 Sri Lankans in trouble for breaching ICC Code of Conduct

ఇంతలో మైదానంలోనే ఉన్న చండీమల్, ఇషాంత్ శర్మ వద్దకు వచ్చి నోరు జారాడు. దీంతో మైదానంలో ఉన్న అంఫైర్లు కలగజేసుకుని సర్ది చెప్పారు. ఆ వెంటనే కావాలనే 'నోబాల్' వేస్తూ ప్రసాద్ మరో బౌన్సర్ వేసినా భారత బౌలర్ ఇబ్బంది పడలేదు.

కానీ చివరి బంతికి అశ్విన్ అవుటై అంతా పెవిలియన్ వెళుతున్న దశలో శ్రీలంక బౌలర్ ధమ్మిక ప్రసాద్ ముందుకు దూసుకొచ్చి మళ్లీ ఇషాంత్‌పై నోరు జారాడు. చండీమల్‌ను అవుట్ చేసి ఇషాంత్ మళ్లీ తనదైన శైలిని ప్రదర్శించాడు. దీంతో ఇషాంత్ శర్మకు మ్యాచ్ ఫీజులో 65 శాతం జరిమానా విధించారు.

English summary
Four players in the ongoing India-Sri Lanka 3rd Test at Sinhalese Sports Club (SSC) ground are set to be punished for their on-field altercations.
మీ వ్యాఖ్య రాయండి