Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఛారిటీ క్రికెట్ మ్యాచ్‌లో వన్డే కెప్టెన్ ధోని, సెహ్వాగ్

Posted by:
Published: Wednesday, September 2, 2015, 16:50 [IST]

ఇంగ్లాండ్ రాజధాని లండన్‌లో ప్రతి ఏటా జరిగే ఛారిటీ క్రికెట్‌లో భారత క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని, సెహ్వాగ్‌లు పాల్గొనున్నారు. ఇక్కడ ఇంకో విశేషమేమిటంటే టీమిండియా వన్డే కెప్టెన్ ధోని, పాకిస్థాన్ టీ20 జట్టు కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఒకే జట్టులో ఉన్నారు.

ఇంగ్లాండ్‌లో హెల్ప్ ఫర్ హీరోస్ పేరిట ఛారిటీ క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహిస్తారు. సెప్టెంబర్ 17న లండన్‌లోని ఓవెల్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్ డైరెక్టర్ ఆఫ్‌ క్రికెట్‌ ఆండ్య్రూ ఈ పోటీలకు నిర్వహణ బాధ్యత వహిస్తున్నారు.

భారత మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ సైతం నిర్వహణ బాధ్యతల్లో పంచుకోనున్నారు. హీరోస్ XI జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలను ఆండ్రూ స్ట్రాస్ నిర్వహిస్తుండగా, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ XI జట్టుకు కెప్టెన్‌గా న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండన్ మెక్‌కల్లమ్ ఉన్నారు.

 MS Dhoni and Shahid Afridi in same team to face Rest of the World XI

ఈ సందర్భంగా ధోని మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టార్‌ క్రికెటర్లతో కలిసి లండన్‌లో క్రికెట్‌ ఆడే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ఓ మంచి పనికోసం నిర్వహించే ఈ పోటీల్లో తాను భాగస్వామినవుతున్నానని ఆనందం వ్యక్తం చేశారు.

Help for Heroes XI: ఆండ్రూ స్ట్రాస్ (కెప్టెన్), ధోనీ, వీరేంద్ర సెహ్వాగ్, షాహిద్ అఫ్రిది, గిబ్స్, డామియన్ మార్టిన్ను గ్రేమ్ స్వాన్, సైమన్ జోన్స్, మాథ్యూ హోగార్డ్, డారెన్ గాఫ్, లెఫ్టినెంట్ కమాండర్ జోనాథన్ పార్కర్, కార్పోరల్ జేక్ వ్రే.

కోచ్: ఇంకా ధ్రువీకరించ లేదు. మేనేజర్: సర్ ఇయాన్ బోథం.

Rest of the World XI: బ్రెండన్ మెక్కల్లమ్ (కెప్టెన్), బ్రియాన్ లారా, మాథ్యూ హేడెన్, మహేల జయవర్ధనే, గ్రేమ్ స్మిత్, స్కాట్ స్టైరిస్, డేనియల్ వెట్టోరి, షాపూర్ జార్డన్, అబ్దుల్ రజాక్, టిమ్ సౌథీ, మేజర్ స్టార్మ్ గ్రీన్.

కోచ్: గ్యారీ కిర్‌స్టెన్. మేనేజర్: సునీల్ గవాస్కర్.

English summary
India's ODI captain MS Dhoni, Virender Sehwag, Pakistan's T20I skipper Shahid Afridi and other stars will be in the same team as they face a Rest of the World XI in a charity match this month.
మీ వ్యాఖ్య రాయండి