Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

ఒకింత కోహ్లీ వల్లే!: ఇషాంత్ శర్మ బ్యాన్‌పై కొత్త ట్విస్ట్!!

Posted by:
Published: Thursday, September 3, 2015, 13:22 [IST]

న్యూఢిల్లీ/ముంబై: శ్రీలంకతో జరిగిన మూడో టెస్టులో ఇషాంత్ శర్మ దూకుడుగా వ్యవహరించి ఓ టెస్టు మ్యాచ్ నిషేధం ఎదుర్కొంటున్నాడు. దీని పైన ఇషాంత్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ కోహ్లీ, డైరెక్టర్ రవిశాస్త్రి వల్లే ఇది జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

శ్రీలంక పర్యటనలో మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ 2-1తో గెలుచుకుంది. ఇరవై రెండేళ్ల తర్వాత శ్రీలంకలో భారత్ సిరీస్ గెలిచింది. అయితే, మూడో టెస్టు సందర్భంగా ఇషాంత్ శర్మ దూకుడు ప్రదర్శించాడు. దీంతో అతని పైన ఓ టెస్ట్ బ్యాన్ పడింది.

Ishant 'suffered' with 1-Test ban because of Kohli, Shastri: Coach

దీనిపై ఇషాంత్ శర్మ కోచ్ శ్రవణ్ కుమార్ స్పందించాడు. కోహ్లీ, రవిశాస్త్రిల వల్లే ఇది జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈసారి ఇషాంత్ శర్మ తన లిమిట్స్ క్రాస్ చేశాడన్నాడు. స్లెడ్జింగ్ ఆటలో భాగమని, కానీ ఇషాంత్ ఈసారి మరింత దూకుడు ప్రదర్శించాడని అభిప్రాయపడ్డాడు.

ఇషాంత్ శర్మ దూకుడు డ్రెస్సింగ్ రూం ప్రభావం కావొచ్చని అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా... దూకుడు గురించి ఎక్కువగా మాట్లాడే కెప్టెన్ కోహ్లీ, డైరెక్టర్ రవిశాస్త్రిల ప్రభావం పడి ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

ఇషాంత్ దూకుడు ప్రదర్శించవద్దని సూచించాడు. దూకుడు తగ్గించుకోవాలని తాను తప్పకుండా అతనికి చెబుతానని, అయితే బ్యాన్ ద్వారా అతను ఇప్పటికే రియలైజ్ అయి ఉంటాడని చెప్పాడు.

English summary
India's fast bowler Ishant Sharma has "suffered" with a one-Test ban due to captain Virat Kohli and Team Director Ravi Shastri, according to the paceman's personal coach.
మీ వ్యాఖ్య రాయండి