Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

టీమిండియా కమేడియన్స్: ధోనీ, శిఖర్‌పై రైనా

Published: Thursday, September 3, 2015, 12:24 [IST]

న్యూఢిల్లీ: టీమిండియాలో ఇద్దరు కమేడియన్లు ఉన్నారని ఆల్ రౌండర్ సురేష్ రైనా అన్నాడు. వారేవరో కాదు.. టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఓపెనర్ శిఖర్ ధావన్‌లేనని చెప్పాడు.

డ్రెస్సింగ్ రూమ్‌లో ధోనీ, ధావన్ తెగనవ్విస్తారని రైనా తెలిపాడు. ‘ధావనైతే బిగ్గరగా నవ్వుతాడు.. అందర్నీ నవ్విస్తాడు' అని అన్నాడు. ధోనీని గొప్ప స్ఫూర్తి ప్రదాత అని కొనియాడాడు.

బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ వ్యాఖ్యాతగా జరిగే ‘కుచ్‌భీ హోసక్తాహై' అనే పాపులర్ టీవీ షోలో పాల్గొన్న రైనా పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నాడు. ధోనీ ఫీల్డ్‌లో సీరియస్‌గా ఉంటాడు గానీ, ఆఫ్ ది ఫీల్డ్‌లో అతను గొప్ప ఎంటర్‌టైనర్ అని చెప్పాడు.

 Shikhar, Dhoni comedians of the team: Raina

‘మహీ చాలా సరదా మనిషి. ధావన్ బిగ్గరగా నవ్వుతాడని అతణ్ని మేమంతా డాకూ (దోపిడీదారు) అని పిలుస్తాం. శిఖర్ సూఫీ తరహా (భక్తి, ఆధ్యాత్మిక) భావాలున్న వ్యక్తి. కానీ, తన చేష్ఠలతో అందర్నీ ఖుషీ చేస్తాడు' అని రైనా అన్నాడు.

ఇటీవలే తన ప్రేయసి ప్రియాంక చౌదరిని వివాహం చేసుకున్న ఈ ఉత్తరప్రదేశ్ లెప్ట్‌హ్యాండర్ తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర అంశాల్ని వెల్లడించాడు. ఈ కార్యక్రమాన్ని కలర్స్ టీవీలో వచ్చే ఆదివారం రాత్రి 8 గంటలకు వీక్షించవచ్చు.

English summary
Cricketer Suresh Raina, known as an attacking left hander, will be seen spilling the beans on his fellow cricketers such as Shikhar Dhawan and Mahendra Singh Dhoni while chit-chatting with host Anupam Kher.
మీ వ్యాఖ్య రాయండి