Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

సంగక్కర ట్విట్టర్ అకౌంట్ హ్యాక్: అభ్యంతరకర ఫోటోలు, క్షమాపణ

Posted by:
Published: Thursday, September 3, 2015, 11:53 [IST]

కొలంబో: శ్రీలంక క్రికెట్ దిగ్గజం, ఇటీవలె రిటైర్మెంట్ ప్రకటించిన కుమార్ సంగక్కర ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. సంగక్కరకు సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. దీంతో సంగక్కర ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన దుండగులు ఆయన ఖాతాలో అభ్యంతరకర ఫోటోలు పోస్టు చేశారు.

దీంతో సంగక్కర అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. తన ఖాతా హ్యాకింగ్‌కు గురైందని వివరించాడు. తాను చెప్పేంత వరకు తన ఖాతాలో వచ్చే అభ్యంతరకర పోస్టులను పట్టించుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశాడు.

Sri Lankan legend Kumar Sangakkara`s Twitter account hacked

ఇటీవల ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్లు హ్యాకింగ్‌కు గురవుతోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ హ్యాకర్ల బారిన పడిన సంగతి తెలిసిందే. పలువురు ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్లు హ్యాకింగ్‌కు గరువుతున్నాయి. ఇప్పుడు సంగక్కర వంతు వచ్చింది.

English summary
Sri Lankan legend Kumar Sangakkara on Wednesday claimed that his Twitter account had been hacked after an obscene tweet appeared on his verified Twitter account.
మీ వ్యాఖ్య రాయండి