Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

దేవుడు విడిచిపెడ్తాడేమో కానీ, రహానే కాదు: కోచ్

Published: Friday, September 4, 2015, 15:22 [IST]

చెన్నై: భారత ఆటగాడు అజింక్యా రహానేపై భారత పీల్డిండ్ కోచ్ ఆర్ శ్రీధర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఫీల్డింగ్ అనేది ఆటగాళ్లకు ఉండాల్సిన ప్రాథమిక నైపుణ్యమని భారత క్రికెట్ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ పేర్కొన్నాడు.

ఆటగాళ్ల ఫీల్డింగ్ గురించి మీడియా ఆయనను ప్రశ్నించగా.. 'దేవుడైనా కూడా పొరపాటున క్యాచ్ వదిలేస్తాడేమో కానీ రహానే అలా కాదు' అంటూ ప్రశంసించాడు. కొన్నిసార్లు తప్పులు జరుగుతాయని వెంటనే వాటి నుంచి పాఠం నేర్చుకోవాలని ఆటగాళ్లకు సూచించాడు.

శ్రీలంకతో రెండో టెస్టులో కుమార సంగక్కర క్యాచ్ వదిలేసిన రహానే.. ఆరు ఓవర్ల తర్వాత అదే ఆటగాడు ఇచ్చిన క్యాచ్‌నే ఒంటి చేత్తో ఒడిసిపట్టడం చూస్తే అతని ఫీల్డింగ్ ప్రతిభ అర్థమవుతోందంటూ కితాబిచ్చాడు.

Even God could drop a catch at slips, not Ajinkya Rahane: R Sridhar

ఏ జట్టుకైనా ఫీల్డింగ్ కీలక అంశమని శ్రీధర్ తెలిపాడు. శ్రీలంకతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ ఫీల్డింగ్ కొంత మెరుగైందని, దీంతో లంక ఆటగాళ్లను ఒత్తిడిలోకి నెట్టగలిగామని తెలిపాడు.

టీం డైరెక్టర్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా దీన్నే నమ్ముతారని చెప్పాడు. ఈ సిరీస్‌లో బాగా రాణించిన ఆటగాళ్లలో అమిత్ మిశ్రా ఒకడని పేర్కొన్నాడు. బిసిసిఐ ఫీల్డింగ్ విభాగంపై అమితమైన శ్రద్ధ తీసుకుంటోందని వివరించారు.

English summary
R Sridhar, Indian team's fielding coach - spoke to Media on how the team management treats fielding as a primary skill and on the players who stood out on the field in the just-concluded India-Sri Lanka Test series.
మీ వ్యాఖ్య రాయండి