Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

భారత్‌తో ఓటమి: కోచ్ పదవికి ఆటపట్టు రాజీనామా

Posted by:
Published: Friday, September 4, 2015, 15:00 [IST]

కొలంబో: స్వదేశంలో రెండు వరుస సిరిస్ ఓటములతో శ్రీలంక క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టించింది. భారత్‌తో జరిగిన టె్సటు సిరిస్ పరాజయానికి బాధ్యత వహిస్తూ శ్రీలంక జట్టు చీఫ్ కోచ్ మర్వన్ ఆటపట్టు తన పదవికి రాజీనామా చేశాడు.

గత మూడు నెలల్లో శ్రీలంక వరుసగా పాకిస్థాన్, భారత్ చేతిలో టెస్టు సిరిస్‌ను ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇటీవలే భారత్‌తో జరిగిన మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-1 తేడాతో భారత్ గెల్చుకున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో వరుస సిరిస్ ఓటములకు బాధ్యత వహిస్తూ కోచ్ మర్వన్ ఆటపట్టు రాజీనామా చేశాడు. ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నట్టు శ్రీలంక క్రికెట్‌ తాత్కాలిక అధ్యక్షుడు సిదాత్‌ వెట్టిముని తెలిపాడు.

Marvan Atapattu resigns as Sri Lanka coach after Test series loss to India

ఆటపట్టు శ్రీలంక తరఫున 90 టెస్టులు, 268 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 5502, వన్డేల్లో 8529 పరుగులు సాధించాడు. శ్రీలంక జట్టుకు 2011 నుంచి బ్యాటింగ్‌ కోచ్‌గా సేవలందించిన ఆటపట్టు గతేడాది సెప్టెంబర్‌లో ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు.

ఇది ఇలా ఉంటే బంగ్లాదేశ్‌ జట్టుకు కోచ్‌గా సేవలందిస్తున్న చండికా హతురసింఘేను కొత్త కోచ్‌గా నియమించాలనే ఆలోచనలో శ్రీలంక బోర్డు ఉంది. కోచ్ చండికా ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ వరల్డ్ కప్ క్వార్టర్స్‌కు వెళ్లడమే కాకుండా పాకిస్ధాన్, భారత్, దక్షిణాఫ్రికాలతో జరిగిన వన్డే సిరిస్‌లలో చక్కగా రాణించింది.

English summary
Former Sri Lankan captain Marvan Atapattu today resigned from the post of chief coach of the national cricket team following their recent 1-2 Test series defeat against India.
మీ వ్యాఖ్య రాయండి