Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

కేరళలో లగ్జరీ విల్లా కోసం సచిన్ టెండూల్కర్ ప్లాన్

Updated: Friday, September 4, 2015, 17:02 [IST]

కొచ్చి: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రకృతి అందాలకు నెలవైన కేరళలో విలాసవంతమైన ఓ విల్లాను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. కొచ్చి సముద్రతీరంలోని పానంగడ్ ప్రాంతంలో సచిన్ ఓ విల్లాను ఎంపిక చేసుకున్నట్టు సమాచారం.

ఈ మేరకు ఇప్పటికే ఓసారి విల్లాను సందర్శించిన సచిన్, రెండు స్విమ్మింగ్ పూల్స్ ఉండాలని.. ఒకటి టాప్ ఫ్లోర్‌లో మరొకటి విల్లా ముందు ఉండాలని సూచించాడట. 24 గంటలపాటు విల్లా వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు ఉండాలని తెలిపారట.

ఇందుకు గాను ఎక్కడికక్కడ హై రెజల్యూషన్ కెమరాలను ఏర్పాటు చేయాలనీ చెప్పాడట. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం రాత్రి కొచ్చికి రానున్న సచిన్ మరోసారి విల్లాలోని ఏర్పాట్లను పరిశీలించవచ్చని సమాచారం.

Sachin Tendulkar plan to own luxury waterfront villa in Kerala

ఇది ఇలా ఉండగా, గ్రామీణ ప్రాంతాల ప్రజలను దురలవాట్ల నుంచి దూరం చేసే ఉద్దేశంతో కోయంబత్తూర్‌లో శుక్రవారం నిర్వహించే ‘గ్రామీణ పునర్‌ నవీనీకరణ' శిబిరానికి సచిన్‌ స్టార్‌ అట్రాక్షన్‌గా నిలవనున్నాడు.

మద్యం, ధూమపానం అలవాట్లను దూరం చేయడంతో పాటు వివిధ అంశాల్లో గ్రామస్థులు ఉమ్మడి నిర్ణయాలు తీసుకునేలా చేసేందుకు ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ క్రీడా పోటీలను ఏర్పాటు చేశారు. వీటిలో విజేతలకు మాస్టర్‌ బహుమతులు అందిస్తారని నిర్వాహకులు తెలిపారు.

మొయినుద్దౌలాలో గంభీర్‌

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో సహా చాలా మంది మాజీ క్రికెటర్లు మొయినుద్దౌలా టోర్నీలో సత్తాచాటి తిరిగి జట్టులోకొచ్చారు. కాగా, ఇప్పడు టీమిండియాకు దూరమైన గౌతమ్‌ గంభీర్‌ కూడా వారి బాటలోనే నడుస్తున్నాడు. హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న తాజా టోర్నీలో గౌతం గంభీర్ ఓఎన్‌జీసీ తరఫున ఆడుతూ తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేశాడు.

Story first published:  Friday, September 4, 2015, 14:57 [IST]
English summary
Cricket icon Sachin Tendulkar plans to own a luxury waterfront villa in 'God's own country.'
మీ వ్యాఖ్య రాయండి