Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

టెస్టు క్రికెట్‌కు ఆసీస్ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ వీడ్కోలు

Posted by:
Published: Sunday, September 6, 2015, 16:27 [IST]

ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ టెస్టు క్రికెట్ నుంచి వీడ్కోలు పలకనున్నాడు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు షేన్ వాట్సన్ ఆదివారం ప్రకటించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో గాయపడిన షేన్ వాట్సన్ ఆదివారం మాట్లాడుతూ టెస్టుల నుంచి రిటైరయ్యే సమయం ఆసన్నమైందని తెలిపాడు.

Shane Watson retires from Test cricket

వన్డేల్లో, టెస్టుల్లో, ట్వంటీ 20ల్లో ఆస్టేలియాకు ఎన్నో అద్భుత విజయాలందించిన షేన్ వాట్సన్ 59 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 2005లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. టెస్టుల్లో 35కు పైగా యావరేజితో నాలుగు సెంచరీలు చేశాడు.

టెస్టుల్లో షేన్ వాట్సన్ అత్యధిక స్కోరు 176 కాగా 75 వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆస్టేలియా 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. వన్డే సిరిస్‌కు ముందు జరిగిన టెస్టు సిరిస్‌ను ఆసీస్ 2-3 తేడాతో కోల్పోయిన సంగతి తెలిసిందే.

English summary
Australia allrounder Shane Watson has retired from Test cricket with immediate effect, Cricket Australia tweeted on Sunday. Watson, 34, had played 59 Tests in a career that began in 2005, scoring 3731 runs at 35.19 and taking 75 wickets at 33.68. Injury and form had been issues for Watson at various points through his career.
మీ వ్యాఖ్య రాయండి