Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

80లక్షల ఫాలోవర్లు: సచిన్‌ను దాటేసిన కోహ్లీ

Published: Monday, September 7, 2015, 9:27 [IST]

న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్ దేవుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌ను దాటేశాడు. అయితే ఏ రికార్డు బద్దలైందో అని అనుకోకండి. విరాట్‌ కోహ్లీ.. సచిన్‌ను అధిగమించింది క్రికెట్‌లో కాదు.. ట్విటర్‌లో.

ఆటలో యమ దూకుడు ప్రదర్శించే కోహ్లీ ట్విట్టర్‌లోనూ తనదైన స్పీడుతో దూసుకెళుతున్నాడు. ట్విట్టర్‌లో ఈ యువ సంచలనానికి ఫాలోవర్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.

Virat Kohli Overtakes Sachin Tendulkar With Eight Million Twitter Followers

ఈ విషయంలోనే అతడు సచిన్‌ను దాటేశాడు. ప్రస్తుతం ట్విట్టర్‌లో సచిన్‌కు 77.3 లక్షల మంది ఫాలోవర్లున్నారు. కోహ్లీని అనుసరిస్తున్న వారి సంఖ్య 80.01 లక్షలకు చేరుకుంది. ఇక టీమిండియా వన్డే, టీ20 ఫార్మాట్ల సారథి మహేంద్ర సింగ్ ధోనీకి ట్విట్టర్ లో 45.2 లక్షల మంది ఫాలోవర్లున్నారు.

ఆదివారానికి ఈ సామాజిక అనుసంధాన వేదికలో కోహ్లిని అనుసరిస్తున్న వారి సంఖ్య 80లక్షలు దాటింది. ఈ సందర్భంగా తన అభిమానులందరికీ కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్‌ కూడా చేశాడు కోహ్లి. కాగా, ట్విట్టర్‌లో కోహ్లీ ముందున్నా.. ఫేస్‌బుక్‌లో మాత్రం సచిన్‌దే పైచేయిగా ఉంది.

English summary
Indian Test captain Virat Kohli on Sunday thanked his growing fan base, which has taken his Twitter following to 8 million.
మీ వ్యాఖ్య రాయండి