Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

హైదరాబాద్‌కు విరాట్‌ కోహ్లీ ఫ్యాషన్ బ్రాండ్ ‘రాన్‌’

Published: Monday, September 7, 2015, 16:14 [IST]

న్యూఢిల్లీ: భారత టెస్ట్ జట్టు కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, యూనివర్సల్‌ స్పోర్ట్స్‌ బిజ్‌కు చెందిన యూత్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ‘రాన్‌'.. ఎక్స్‌క్లూజివ్‌ రిటైల్‌ స్టోర్లను విస్తరించే సన్నాహాల్లో ఉంది. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌ కూడా స్టోర్‌ను ప్రారంభించనుంది.

హైదరాబాద్ తోపాటు ముంబై, బెంగళూరులో ఐదు ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్టు యూనివర్సల్‌ స్పోర్ట్స్‌బిజ్‌ వ్యవస్థాపకురాలు అంజనా రెడ్డి తెలిపారు.

Virat Kohli's fashion brand WROGN plans retail expansion

అంతేగాకుండా, షాపర్స్‌ స్టాప్‌ స్టోర్లలో మరో 10 షాప్‌ ఇన్‌ షాప్స్‌ను ప్రారంభించే యోచనలో ఉన్నామని చెప్పారు. ఇప్పటికే షాపర్స్‌ స్టాప్‌లో 60-65 స్టోర్లను కలిగి ఉన్నట్టు ఆమె తెలిపారు.

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో విస్తరణపై దృష్టిపెట్టామని, వచ్చే రెండుమూడేళ్ల కాలంలో విదేశీ మార్కెట్లలోకి ప్రవేశిస్తామన్నారు. రాన్‌, ఇమారా బ్రాండ్స్‌ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కోటి డాలర్ల టర్నోవర్‌ను లక్ష్యంగా చేసుకున్నామని వివరించారు.

English summary
Youth fashion brand 'WROGN', co-owned by cricket test captain Virat Kohli and Universal Sportsbiz, is embarking on retail expansion with plans to open exclusive stores in metros besides enhancing other points of sales.
మీ వ్యాఖ్య రాయండి