Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

నా భార్య చెప్పింది: సినిమాలో పాట పాడిన రైనా

Posted by:
Published: Tuesday, September 8, 2015, 12:08 [IST]

న్యూఢిల్లీ: క్రికెట్ ఆటతో సత్తా చాటుతున్న భారత జట్టు ఆటగాడు సురేష్ రైనా కొత్తగా.. తన గొంతు మాధుర్యాన్ని వినిపిస్తున్నాడు. రైనా ఓ చిత్రం కోసం గాయకుడి అవతారం ఎత్తాడు.

మీరఠియా గ్యాంగ్‌స్టర్స్‌ అనే బాలీవుడ్‌ సినిమా కోసం అతను ఓ పాట పాడాడు. తు మిలి సబ్‌ మిలా.. అనే పల్లవితో సాగే ఈ గీతాన్ని సోమవారం నాడు ముంబైలో విడుదల చేశారు.

Suresh Raina

ఈ సందర్భంగా రైనా మాట్లాడాడు. క్రికెట్‌ మధ్యలో సంగీతమే తనకు తోడుగా నిలుస్తుందని, పాటలు వింటూ వింటూ పాడటం కూడా అలవాటైపోయిందని చెప్పాడు. మీరఠియా గ్యాంగ్‌స్టర్స్‌ సినిమా నిర్మాత షోయబ్‌ అహ్మద్‌ తమ కుటుంబానికి సన్నిహితుడని చెప్పాడు.

అతను కొన్నాళ్ల క్రితం ఈ సినిమాలో ఓ పాట పాడమని అడిగాడని, తన భార్య ప్రియాంక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని సూచించిందన్నాడు. ఈ పాటను ఆస్వాదిస్తూ పాడానని చెప్పాడు. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానని చెప్పాడు. కాగా, ఈ చిత్రం 18వ తేదీన విడుదల కానుంది.

English summary
After enthralling sports fans with the bat, Indian cricketer Suresh Raina is now set to woo the music aficionados as he lends his voice to a song in the upcoming film 'Meeruthiya Gangsters'.
మీ వ్యాఖ్య రాయండి