Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

లవర్‌లా ఇండియా వెంటపడొద్దు: జావెద్, పిసిబి రివర్స్

Posted by:
Published: Wednesday, September 9, 2015, 10:49 [IST]

కరాచీ: తటస్థ వేదిక యూఏఈలో భారత్ - పాకిస్తాన్ సిరీస్ పైన నీలి మేఘాలు కమ్ముకోవడంతో... నిన్నటి వరకు సిరీస్ కోసం వేచి చూసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) తాజాగా మరో రకంగా స్పందించింది.

సిరీస్ కోసం తాము భారత్‌కు చెందిన బిసిసిఐ వెనుక ఏం పడటం లేదని అభిప్రాయపడింది. అంతకుముందు జావెద్ మియాందాద్ మాట్లాడుతూ... పిసిబి సిరీస్ కోసం బిసిసిఐ వెంట పడటం సరికాదని అభిప్రాయపడ్డాడు. ప్రేమను తిరస్కరించిన వ్యక్తిలా నిత్యం బిసిసిఐ వెంట పడవద్దని సూచించాడు.

ఈ నేపథ్యంలో పిసిబి కూడా వెనక్కి తగ్గింది. పిసిబి చీఫ్ షహర్యార్ ఖాన్ మాట మార్చేశారు. నిన్నటిదాకా బిసిసిఐ వెంటబడ్డ ఆయన ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. సిరీస్ జరగకపోయినా తమకేమీ నష్టం లేదన్నాడు.

భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య సిరీస్‌కు ఇరు దేశాల బోర్డుల మధ్య ఒప్పందం కుదిరిందని, అయితే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని బీసీసీఐ మెలిక పెడుతోందని, మేమేమీ వారి వెంటపడటం లేదని, ఒప్పందాన్ని గౌరవించమని మాత్రమే చెబుతున్నామని మంగళవారం చెప్పాడు.

India-Pakistan cricket: We are 'not running after' BCCI, says PCB

ఇటీవల కోల్‌కతాకు గుట్టు చప్పుడు కాకుండా వచ్చిన షహర్యార్... బీసీసీఐ చీఫ్ జగ్మోహన్ దాల్మియాతో భేటీ అయ్యాడు. అయితే భారత్ తో మ్యాచ్‌ల కోసం వెంపర్లాడాల్సిన అవసరమేమీ లేదని ఆ దేశ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో షహర్యార్ యూటర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

క్రికెట్‌లో పాకిస్తాన్ ఎప్పుడు కూడా భారత్‌కు తీసిపోవద్దని, క్రికెటింగ్‌లో ఆ దేశం కంటే పాకిస్తానే ముందంజలో ఉందని జావెద్ మియందాద్ వ్యాఖ్యానించాడని తెలుస్తోంది. అయితే, భారత్‌తో క్రికెట్ కోసం వెంపర్లాడవద్దని, పాకిస్తాన్ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టవద్దని సూచించాడు.

English summary
Pakistan great and India nemesis, Javed Miandad, is at it again. At a recent function in Karachi, Miandad advised the PCB to stop chasing after the BCCI to play a bilateral series.
మీ వ్యాఖ్య రాయండి