Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

పాక్ క్రికెట్‌పై బాంబు పేల్చిన జావెద్ మియాందాద్

Posted by:
Published: Thursday, September 10, 2015, 19:00 [IST]

కరాచీ: పాకిస్తాన్ క్రికెట్‌పై పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ బాంబు పేల్చాడు. కొంత మంది క్రికెటర్లు బహిరంగంగానే అనైతిక చర్యలకు, అవినీతికి పాల్పడడంతో తాను 1999లో కోచ్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.

ఆ విషయాన్ని తాను అప్పట్లో క్రికెట్ బోర్డు చైర్మన్ ఖలీద్ మెహమూద్‌కు చెప్పానని, చర్యలు తీసుకోకపోతే పాకిస్తాన్ క్రికెట్‌కు కోలుకోలేని నష్టం జరుగుతుందని చెప్పానని, కోచ్ పదవిలో కొనసాగడానికి తన మనసు అంగీకరించలేదని, దాంతో పదవి నుంచి తప్పుకున్నానని ఆయన వివరించారు.

Javed Miandad

1999 ఫిక్సింగ్ భూతం పాకిస్తాన్ క్రికెట్ పునాదులను బలహీనపరిచిందని అన్నారు. కొంత ఆటగాళ్లు తిరుగుబాటు ప్రకటించడంతో ఇంగ్లాండులో జరిగిన ప్రపంచ కప్ పోటీలకు ముందే మియాందాద్ కోచ్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

మియాందాద్ కింద ఆడడానకి ఆటగాళ్లు నిరాకరించారు. ఆటతీరు బాగాలేదని చెప్పినప్పుడు జరిగిన గొడవలో మియాందాద్‌ను ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు డ్రెసింగ్ రూంలో బ్యాట్‌తో బెదిరించారు కూడా.

English summary
In a startling revelation, Pakistan's former captain Javed Miandad has claimed that he decided to step down as the national coach in 1999 as some players were openly indulging in corruption and unethical practices.
మీ వ్యాఖ్య రాయండి