Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

సచిన్ ట్వీట్‌కు కోహ్లీ రీట్వీట్: ఫ్యాన్స్ మధ్య యుద్ధం

Posted by:
Published: Saturday, September 12, 2015, 10:29 [IST]

లెజెండ్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం నడిచింది. అయితే అభిమానులు మాత్రం ఇదేమి సీరియస్ పోరు కాదని, సరదాగానే వారిద్దరూ ట్వీట్స్ చేశారని అభిప్రాయడపడుతున్నారు.

వివరాల్లోకెళితే... శుక్రవారం సచిన్ టెండూల్కర్, కోహ్లీని ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. ‘నేను ఆడాలనుకుంటున్నాను' అన్న సచిన్ ట్వీట్‌కు కోహ్లీ కూడా వేగంగానే స్పందించాడు. ‘‘కచ్చితంగా చెప్పలేను కానీ, మీకు కావాల్సిన అర్హతలు లేవు'' అని కోహ్లీ, సచిన్‌కు రీ ట్వీట్ చేశాడు.

 Kohli Tweeted Something For Sachin Which Started A Twitter War Between Their Fans

ఈ ట్వీట్లను చూసిన అభిమానులు ట్విట్టర్‌లో తమదైన శైలిలో ట్వీట్స్ సంధించారు. ఇటీవలే ఇండియన్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో యూఏఈ రాయల్స్‌ జట్టుకు టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి సహా యజమానిగా ఉన్నారు. రాయల్స్ జట్టుకు స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ నేతృత్వం వహిస్తున్నాడు.

రోజర్ ఫెదరర్ కు సచిన్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తన ఫేవరేట్ టెన్నిస్ క్రీడాకారుడితో కలసి ఆడాలన్న తన కోరికను సచిన్ ఈ విధంగా సరదాగా ట్వీట్ చేశారు.

English summary
Kohli lately made an announcement about his being United Arab Emirates Royals team’s new co-owner in IPTL (International Premier Tennis League). The captain of this team is Roger Federer and IPTL’s second edition will be starting in December this year.
మీ వ్యాఖ్య రాయండి