Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

విష్ణువు రూపంలో ధోని ఫొటో: సుప్రీంలో ఊరట

Posted by:
Published: Monday, September 14, 2015, 12:36 [IST]

న్యూఢిల్లీ: టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. మత విశ్వాసాలను దెబ్బతీశారంటూ ధోనీపై నమోదైన కేసుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్టే విధించింది.

బిజినెస్ టుడే పత్రిక కవర్ పేజీపై విష్థువు రూపంలో తన ఫొటోను ప్రచురించిన వివాదంపై జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోనీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. గురువారం సుప్రీంకోర్టులో ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. 2013లో జరిగిన ఆ ఘటనపై ఆయన అప్పట్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Case on hurting religious sentiments: SC stays criminal proceedings against MS Dhoni

బెంగుళూరు కోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది. బెంగుళూరు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో తనపై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలని సుప్రీం కోర్టుని కోరిన విషయం తెలిసిందే. ఈ కేసును ఈ నెల 14వ తేదీన విచారించనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది.

దీంతో సోమావారం ఈ కేసుని విచారించిన సుప్రీంకోర్టు స్టే విధించింది. ది గాడ్ ఆఫ్ బిగ్ డీల్స్ శీర్షికతో బిజినెస్ టుడే విష్ణువు రూపంలో ధోనీ చిత్రాన్ని ప్రచురించింది. హిందూ మతస్తుల మనోభావాలను, దేవుళ్లనూ దేవతలనూ కించపరిచారని ఆరోపిస్తూ ధోనీపై, ప్రచురణకర్తపై, సంపాదకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు.

English summary
In what could be a big relief for India’s ODI skipper, the Supreme Court on Monday stayed criminal proceedings against MS Dhoni for allegedly hurting religious sentiments for being portrayed as Lord Vishnu.
మీ వ్యాఖ్య రాయండి