Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

టీ20 వరల్డ్ కప్ దాకా శాస్త్రినే: వివాదంలో కోహ్లీ-రవిశాస్త్రి

Posted by:
Published: Monday, September 14, 2015, 13:26 [IST]

ముంబై: వచ్చే ఏడాది మన దేశంలో జరగనున్న టీ -20 ప్రపంచ కప్ వరకు భారత క్రికెట్ జట్టు డైరెక్టర్‌గా రవిశాస్త్రి కొనసాగనున్నాడు. సలహా కమిటీ సిఫార్సు మేరకు బిసిసిఐ ఈ నిర్ణయం తీసుకుంది.

2014లో భారత జట్టు డైరెక్టర్‌గా రవిశాస్త్రి నియమితులయ్యారు. ఆ తర్వాత మరో ఏడు నెలలు దీనిని పొడిగించారు. రవిశాస్త్రి హయాంలో భారత జట్టు ప్రపంచ కప్ సెమీస్‌కు చేరడంతో పాటు శ్రీలంక గడ్డ పైన 22 ఏళ్ల తర్వాత టెస్ట్ సిరీస్ నెగ్గింది.

రవిశాస్త్రితో పాటు సంజయ్ బంగర్ (బ్యాటింగ్ కోచ్), భరత్ అరుణ్ (బౌలింగ్ కోచ్), శ్రీధర్ (ఫీల్డింగ్ కోచ్) సేవలను కూడా టీ 20 ప్రపంచ కప్ వరకు పొడిగించింది. సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌లతో కూడిన క్రికెట్ సలహా సంఘం రవిశాస్త్రి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తూ అతన్ని కొనసాగించేందుకు మొగ్గు చూపింది. దీంతో, బీసీసీఐ ఈ మేరకు ప్రకటన చేసింది.

Ravi Shastri's tenure extended by BCCI as India Team Director till World T20 2016

వివాదంలో కోహ్లీ, రవిశాస్త్రి

టెస్ట్ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, జట్టు డైరెక్టర్‌ రవిశాస్త్రి వివాదంలో చిక్కుకున్నారు. భారత క్రికెట్లో పరస్పర విరుద్ధ ప్రయోజనాలు పొందుతున్న ఏ ఒక్కరినీ ఉపేక్షించబోమని బీసీసీఐ చెబుతోంది. ఇలాంటి సమయంలో వీరిద్దరు అంతర్జాతీయ టెన్నిస్‌ ప్రిమియర్‌ లీగ్‌ (ఐటీపీఎల్‌)లో భాగస్వాములు కావడం వివాదాస్పదమవుతోంది.

ఐటీపీఎల్‌ జట్టు యూఏఈ రాయల్స్‌లో కోహ్లి ఇటీవలే వాటా తీసుకోగా అదే జట్టుకు రవిశాస్త్రిని సలహాదారుగా నియమించుకున్నారు. ఐటీపీఎల్‌ బంధం కారణంగా భారత క్రికెట్‌ జట్టుకు సంబంధించిన అంశాల్లో పరస్పరం నిష్పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉండబోదని, ఇది విరుద్ధ ప్రయోజనాల కిందికే వస్తుందని పలువురుఅభిప్రాయపడుతున్నారు.

ఈ అంశాన్ని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్‌ ఠాకూర్‌ దగ్గర ప్రస్తావిస్తే... మీడియా ద్వారా తనకు ఈ విషయం తెలిసిందని, మాట్లాడుతానని చెప్పారు. మరోవైపు, దీంతో క్రికెట్‌కు ఏం సంబంధమని, విరాట్‌ లేదా ఇంకెవరైనా భారత టెన్నిస్‌ జట్టు కెప్టెన్‌ అయితే విరుద్ధ ప్రయోజనాల అంశం గురించి మాట్లాడాలన్నారు.

English summary
Ravi Shastri, the Indian cricket team’s director, will continue in the role till the end of the World T20 to be held at home early next year, the BCCI said on Sunday.
మీ వ్యాఖ్య రాయండి