Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

‘భారత్‌-పాక్‌ సిరీస్‌: 18ఏళ్ల తర్వాత హైదరాబాద్ వచ్చా’

Published: Tuesday, September 15, 2015, 14:55 [IST]

హైదరాబాద్‌: భారత్‌-పాకిస్థాన్ సిరీస్‌ కోసం క్రికెట్‌ ప్రపంచమంతా ఎదురు చూస్తోందని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌, ఐసిసి అధ్యక్షుడు జహీర్‌ అబ్బాస్‌ అన్నారు. బుధవారం జరగనున్న మొహీనుద్దౌలా క్రికెట్‌ కప్‌ ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్‌ వచ్చారు.

ఈ సందర్భంగా ఉప్పల్‌లోని అంతర్జాతీయ క్రికెట్‌ మైదానంలో మీడియాతో ఆయన మాట్లాడారు. భారత్‌-పాకిస్థాన్ దేశాలు క్రికెట్‌లో తలపడాలని అందరూ ఎదురు చూస్తున్నట్లు ఆయన చెప్పారు.

క్రికెట్‌ మరింతగా అభివృద్ధి చేసేందుకు ఐసీసీ కృషి చేస్తోందన్నారు. తాను 18 సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలిపారు. క్రీడలను ప్రోత్సహించేందుకు భాగ్యనగరంలో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని పేర్కొన్నారు.

PCB seeks Zaheer Abbas’ help for Pakistan-India series

ఈ సందర్భంగా ఇండియా కెప్టెన్ అభినవ్ ముకుంద్ ప్రదర్శనపై జహీర్ అబ్బాస్ ప్రశంసలు కురిపించారు. అతని ఆటతీరు చాలా బాగుందని చెప్పారు.

ఇది ఇలా ఉండగా, భారత్‌తో సిరీస్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా జహీర్ అబ్బాస్ మధ్యవర్తిత్వాన్ని నడిపిస్తోంది. ఐసిసి అధ్యక్షుడిగా ఉన్న అబ్బాస్ సాయంతో టీమిండియాతో సిరీస్ ఎలాగైనా ఆడాలని పిసిబి విశ్వప్రయత్నాలు చేస్తోంది. బిసిసిఐతో మాట్లాడి సిరీస్ కోసం భారత్‌ను ఒప్పించేలా చేయాలని చూస్తోంది.

English summary
The Pakistan Cricket Board (PCB) chairman Shahryar Khan in an attempt to finalise the series against India in December has reached out to the International Cricket Council (ICC) president Zaheer Abbas for assistance.
మీ వ్యాఖ్య రాయండి