Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

లక్ష్మణ్‌కు పెద్ద ఫ్యాన్‌ని: ఐసీసీ అధ్యక్షుడు (ఫోటోలు)

Posted by:
Published: Thursday, September 17, 2015, 11:54 [IST]

హైదరాబాద్: భారత్ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు తాను పెద్ద అభిమానినని ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్ పేర్కొన్నాడు. బుధవారం మొయినుద్దౌలా గోల్డ్‌ కప్‌ ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన అబ్బాస్‌ మాట్లాడుతూ అప్పట్లో లక్ష్మణ్ ఆడుతుంటే తాను టీవీ ముందు కూర్చునే వాడినని అన్నారు.

ఆస్టేలియా బౌలర్లను లక్ష్మణ్ చితక్కొడుతుంటే తనకు ముచ్చటేసేదన్నారు. ముఖ్యంగా ఆసీస్ బౌలర్లను లక్ష్మణ్ ఎదుర్కొన్న తీరు తనకు బాగా నచ్చిందన్నారు. యువకులు లక్ష్మణ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని భారత్‌కు ఆడాలని సూచించారు.

లక్ష్మణ్‌కు పెద్ద ఫ్యాన్‌ని: ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్

భారత్ మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌కు తాను పెద్ద అభిమానినని ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్ పేర్కొన్నాడు. బుధవారం మొయినుద్దౌలా గోల్డ్‌ కప్‌ ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన అబ్బాస్‌ మాట్లాడుతూ అప్పట్లో లక్ష్మణ్ ఆడుతుంటే తాను టీవీ ముందు కూర్చునే వాడినని అన్నారు.

లక్ష్మణ్‌కు పెద్ద ఫ్యాన్‌ని: ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్

ఆస్టేలియా బౌలర్లను లక్ష్మణ్ చితక్కొడుతుంటే తనకు ముచ్చటేసేదన్నారు. ముఖ్యంగా ఆసీస్ బౌలర్లను లక్ష్మణ్ ఎదుర్కొన్న తీరు తనకు బాగా నచ్చిందన్నారు. యువకులు లక్ష్మణ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని భారత్‌కు ఆడాలని సూచించారు.

లక్ష్మణ్‌కు పెద్ద ఫ్యాన్‌ని: ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్

ఈ సందర్భంగా వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి రాకముందు తాను కూడా మొయినుద్దౌలాలో ఆడానన్నారు. ‘దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సీనియర్‌ బౌలర్లను ఎదుర్కోవడంతో నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. దాంతో ఇప్పుడు నేనీ స్థాయిలో ఉండగలిగాన'ని చెప్పాడు.

లక్ష్మణ్‌కు పెద్ద ఫ్యాన్‌ని: ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్

ఇక అఖిల భారత మొయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో ఇండియా సిమెంట్స్ విజేతగా నిలిచింది. బుధవారం ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, ఇండియా సిమెంట్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

లక్ష్మణ్‌కు పెద్ద ఫ్యాన్‌ని: ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్

ఓవర్‌నైట్ స్కోరు 75/2 పరుగులతో బుధవారం ఆట కొనసాగించిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 207 పరుగులకు ఆలౌట్ అయింది. 92 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన ఇండియా సిమెంట్స్‌ విజేతగా నిలిచింది.

లక్ష్మణ్‌కు పెద్ద ఫ్యాన్‌ని: ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్

191 బంతుల్లో 101 పరుగులు సాధించిన హైదరాబాద్ ఆటగాడు అక్షత్ రెడ్డి పోరాటం వృధా అయింది. ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్, టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్‌లు విజేతలకు ట్రోఫీలు అందజేశారు.

English summary
India Cements lifted the Moin-ud Dowla Gold Cup by virtue of taking the first innings lead against Hyderabad XI on the third and final day of their title clash here on Wednesday.
మీ వ్యాఖ్య రాయండి