Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

బెస్ట్ ఫినిషర్: ఇంగ్లాండ్‌లో మళ్లీ రెచ్చిపోయిన ధోనీ

Posted by:
Published: Friday, September 18, 2015, 14:17 [IST]

లండన్: మహేంద్ర సింగ్ ధోనీ బెస్ట్ ఫినిషర్ అనే విషయం తెలిసిందే. గత కొద్ది నెలలుగా ఆయన క్రికెట్‌కు దూరంగా ఉంటన్నాడు. అయితే, తాజాగా సెప్టెంబర్ 17వ తేదీన మరోసారి తాను బెస్ట్ ఫినిషర్ అని నిరూపించుకున్నాడు.

చారిటీ మ్యాచ్‌లో ధోనీ చివర్లో అదరగొట్టాడు. హీరోస్ ఎలెవన్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎలివెన్ చారిటీ ట్వంటీ 20 మ్యాచులో 34 ఏళ్ల వయస్సు గల ధోనీ బెస్ట్ ఫినిషర్‌గా మరోసారి చాటి చెప్పాడు.

హీలోస్ ఎలెవన్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే గెలుపు వరించింది. మహేంద్ర సింగ్ ధోనీ 38 పరుగులు చేశాడు.

Finisher MS Dhoni hits winning runs again, this time for 'Heroes'

చివరి ఓవర్లో నాలుగు పరుగులు రావాల్సి ఉంది. మొదటి రెండు బంతులు డాట్ బాల్స్. పరుగులు రాలేదు. చివరి నాలుగు బంతుల్లో నాలుగు పరుగులు చేయాలి. ధోనీ స్ట్రైకింగ్. అతను మూడో బంతిని తనదైన శైలిలో బౌండరీకి తరలించాడు. 20వేల వరకు అభిమానులు మ్యాచ్ చూస్తుండగా ధోనీ మరోసారి బెస్ట్ ఫినిషర్‌గా నిలిచాడు.

ధోనీతో పాటు ఆడిన మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ 30 పరుగులు చేశాడు. మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ 26 పరుగులు చేశాడు. 159 పరుగుల లక్ష్యాన్ని చేధించారు. గిబ్స్, డామియన్ మార్టిన్, షాహిద్ అఫ్రీది, గ్రీమ్ స్వాన్, డారెన్ గో, సిమన్ జోస్, మాథ్యూ హోగార్డ్‌లు హీరోస్ ఎలెవన్ తరఫున ఆడారు.

అంతకుముందు బ్రెండన్ మెకల్లమ్ సారథ్యంలోని రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ .. ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. లారా, మాథ్యూ హెడెన్, డానియల్ వెట్టోరీ, గ్లేన్ స్మిత్, మహేల జయవర్ధనేలు ఉన్నారు. జయవర్ధనే 48 పరుగులు చేశాడు. ధోనీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

English summary
Despite being out of competitive cricket for nearly 3 months, India's ODI captain MS Dhoni showed he has not lost his 'finishing abilities' as he smashed a boundary to win a charity game at The Oval last night (September 17).
మీ వ్యాఖ్య రాయండి