Englishहिन्दीಕನ್ನಡമലയാളംதமிழ்

సీసీఐలో సభ్యత్వం: రహానేతో పాటు సానియాకు

Posted by:
Published: Saturday, September 19, 2015, 11:32 [IST]

సీసీఐలో సభ్యత్వం: రహానేతో పాటు సానియాకు
 

ఇటీవలే యుఎస్ ఓపెన్ డబుల్స్ టైటిల్ సాధించిన టెన్నిస్ స్టార్ సానియా మిర్జాకు కూడా జీవితకాల సభ్యత్వం దక్కనుంది. ఆదివారం జరిగే కార్యక్రమంలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు, ఆమె భర్త షోయబ్ మాలిక్‌కు మెంబర్‌షిప్‌ కార్డును అందజేయనున్నారు.

ఈ కార్యక్రమానికి సానియా భర్త షోయబ్ మాలిక్‌ను తాము ఆహ్వానించామని సీసీఐ ప్రతినిధి తెలిపారు. ఇక సీసీఐ విషయానికి వస్తే బ్రబోర్న్ దీని కేంద్రకార్యాలయం. సీసీఐ అంతర్జాతీయ క్రీడా సౌకర్యాలకు పెట్టింది పేరు. ఇక్కడ క్రికెట్‌తో పాటు టెన్నిస్, బిలియర్డ్స్, స్కాష్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ కోర్టులున్నాయి. అలాగే ఫిట్‌నెస్ సెంటర్, చక్కటి స్విమ్మింగ్ పూల్, కేఫ్, విశాలమైన సమావేశ మందిరం, రీడింగ్ రూమ్‌లున్నాయి.

English summary
Ajinkya Rahane, India's most consistent batsman in the last couple of years, has been conferred with the honorary life membership by the Cricket Club of India (CCI) here on Friday.
మీ వ్యాఖ్య రాయండి